పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టార్ ఇమేజ్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ నటించిన ఏ సినిమా అయినప్పటికీ హిట్ ... ఫ్లాప్ టాక్ తో సంబంధం లేకుండా మొదటి వారం రోజులు అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను సాధిస్తూ ఉంటుంది. ఆ రేంజ్ స్టామినా కలిగిన పవన్ కళ్యాణ్ ఆఖరు గా భీమ్లా నాయక్ మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ లో రానా హీరోగా నటించిన సాగర్ కె చంద్ర ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. మంచి అంచనాలు నడుమ విడుదల అయిన ఈ మూవీ అదిరిపోయే విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది.

ఇలా భీమ్లా నాయక్ విజయంతో ఫుల్ జోష్ లో ఉన్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరిహర వీరమల్లు మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఈ మూవీ చిత్రీకరణ దశలో ఉండగానే పవన్ కళ్యాణ్ అనేక మూవీ లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అందులో భాగంగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ అనే మూవీ లో నటించడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ మూవీ తమిళ స్టార్ హీరోలలో ఒకరు అయినటు వంటి తలపతి విజయ్ హీరోగా రూపొందిన తేరి అనే మూవీ కి అధికారిక రీమేక్ గా రూపొందబోతుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ యొక్క రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ నెల నుండి ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది.

మూవీ యొక్క మొదటి షెడ్యూల్  షూటింగ్ ఏప్రిల్ 5 వ తేదీ నుండి 15 వ తేదీ వరకు 10 రోజుల పాటు జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ ఫస్ట్ షెడ్యూల్.లో ఈ మూవీ కి సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరించడం కోసం ఈ మూవీ యూనిట్ సన్నాహాలను చేస్తున్నట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో ప్రస్తుతం వరుస సినిమా లతో ఫుల్ జోష్.లో ఉన్న శ్రీ లీల హీరోయిన్ గ నటించబోతున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: