ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 2021 వ సంవత్సరంలో విడుదల అయిన పుష్ప ది రైస్ అనే మూవీ తో అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకొని దేశ వ్యాప్తంగా సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ బ్లాక్ బస్టర్ మూవీ కి టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించగా ... రష్మిక మందన ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ లో మలయాళ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ ఉన్న నటుడు అయినటు వంటి ఫాహధ్ ఫజిల్ విలన్ పాత్రలో నటించగా ... సునీల్ ... అనసూయ ... రావు రమేష్మూవీ లో ఇతర ముఖ్య పాత్రలలో నటించారు.

రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతం అందించగా ... మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ సమంతమూవీ లో ఒక స్పెషల్ సాంగ్ లో నటించింది. 2021 వ సంవత్సరంలో భారీ అంచనాల నడుమ తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలో విడుదల మూవీ అన్ని భాషల ప్రేక్షకులను ఎంత గానో ఆకట్టుకొని భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని ... అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను సాధించింది. ఇలా ఈ మూవీ అద్భుతమైన కలెక్షన్ ల u సాధించడంతో పుష్ప ది రూల్ మూవీ పై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు పెరిగిపోయాయి.

మూవీ షూటింగ్ కొన్ని రోజుల క్రితమే ప్రారంభం అయ్యింది. ప్రస్తుతం ఈ మూవీ యొక్క షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోయిన్ అయినటు వంటి సాయి పల్లవి ఒక కీలకమైన పాత్రలో నటించబోతుంది అంటూ కొన్ని వార్తలు బయటికి వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ లో సాయి పల్లవి నటిస్తుంది అనే వార్తలో ఎలాంటి వాస్తవం లేదు అని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: