ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరో గా సుకుమార్ దర్శకత్వం లో ప్రేక్షకుల ముందుకి వచ్చిన చిత్రం "పుష్ప: ది రైజ్" బ్లాక్ బస్టర్ అయిన విషయం తెలిసిందే.

తాజాగా ఈ సినిమాకి సీక్వెల్ గా ఇప్పుడు "పుష్ప: ది రూల్" త్వరలో ప్రేక్షకులు ముందుకి రాబోతోందని తెలుస్తుంది.. ఇక సినిమా మొత్తం కూడా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో అడవి బ్యాక్ డ్రాప్ లో జరుగుతుందని అందరికీ కూడా తెలిసిందే. కానీ చిత్ర బృందం మాత్రం చాలా వరకు సినిమా షూటింగ్ హైదరాబాద్ లోనే పూర్తి చేస్తోందని సమాచారం.

అడవిలోని సన్నివేశాలను షూట్ చేయడానికి అయిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బ్యాంకాక్, సౌత్ ఆఫ్రికా ఎందుకు వెళ్లడం లేదు అని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.. తాజాగా దీనికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయని తెలుస్తుంది.సినిమాలోని కొన్ని సన్నివేశాల కోసం చిత్ర బృందం అడవులకి వెళ్లబోతోందని సమాచారం.. కానీ అది కేవలం కొంత సమయానికి మాత్రమే అని తెలుస్తోంది చాలా వరకు రియల్ టైం ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ ని చిత్ర బృందం కంప్యూటర్ గ్రాఫిక్స్ ద్వారానే క్రియేట్ చేయబోతున్నట్లు తెలుస్తుంది.

ఇప్పటికే చిత్ర బృందం అల్లు స్టూడియోస్ లో 10 కి పైగా సెట్లు ఏర్పాటు చేసిందని, సినిమా షూటింగ్ కూడా అక్కడ జరుగుతుందని తెలుస్తోంది. ప్రతి సన్నివేశాన్ని ఇంకా అద్భుతంగా తీర్చిదిద్దడం కోసం సుకుమార్ రియల్ బ్యాక్‌గ్రౌండ్స్‌ కంటే కూడా కంప్యూటర్ గ్రాఫిక్స్ న్యూస్ వాడితే బ్యాక్ గ్రౌండ్ లు ఇంకా బాగుంటాయని ఆయన నిర్ణయించుకున్నారని తెలుస్తుంది.అంతేకాకుండా నటీనటులను మరియు చిత్ర బృందాన్ని ఇబ్బంది పెట్టి అడవుల కెళ్ళి షూటింగ్ చేయడం కొద్దిగా కష్టం కాబట్టి ఇలా చేయటం ఇంకా సులభమని, మంచి అవుట్ పుట్ కూడా వస్తుందని సుకుమార్ ఈ విధంగా ఆలోచన చేసినట్లు సమాచారం..

మరింత సమాచారం తెలుసుకోండి: