‘బాహుబలి’ మూవీ తెలుగు సినిమా మార్కెట్ ను పాన్ ఇండియా స్థాయికి పెంచడంతో ఒక్కసారిగా టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ ఆలోచనలు పూర్తిగా మారిపోయాయి. దానికి కొనసాగింపుగా ఇప్పుడు ‘కేజీ ఎఫ్ 2’ ‘పుష్ప’ ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీలు వేలకోట్ల కలక్షన్స్ ను కొల్లగొట్టడమే కాకుండా ఆసినిమాల స్థాయి అంతర్జాతీయ స్థాయిలో ఉండటంతో ఇప్పుడు హాలీవుడ్ ఇండస్ట్రీ దృష్టి ఇండియన్ ఫిలిం మార్కెట్ పై పడింది.


అనేక ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థలు ఇండియాలోని ప్రముఖ దర్శకుడు నిర్మాణ సంస్థలతో భాగస్వాములుగా మారి హాలీవుడ్ స్థాయిలో అత్యంత భారీ సినిమాలను తీయడానికి ముందుకు వస్తున్నట్లు సంకేతాలు వస్తున్నాయి. ఈపరిస్థితుల నేపధ్యంలో కేవలం మన ఇండస్ట్రీ టాప్ హీరోలు మాత్రమే కాకుండా మీడియం రేంజ్ హీరోలు టైప్-3 హీరోలు కూడ తమ సినిమాలకు సంబంధించి ఇప్పుడు పాన్ ఇండియా జపం చేస్తూ ఉండటం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది.


ప్రభాస్ జూనియర్ రామ్ చరణ్ అల్లు అర్జున్ లు తమ సినిమాలతో ఇప్పటికే పాన్ ఇండియా హీరోలుగా మారిపోతే ఇప్పుడు ఆలిస్టులోకి త్వరలో మహేష్ చేరబోతున్నాడు. అయితే ఈమ్యానియా కేవలం టాప్ హీరోలకు మాత్రమే కాకుండా మీడియం రేంజ్ సినిమాలకు కూడ పట్టడం అత్యంత ఆశ్చర్యకరంగా మారింది. ఈ నెలాఖరుకు విడుదలకాబోతున్న నాని ‘దసరా’ మూవీని తెలుగు తమిళ కన్నడ మళయాళ హిందీ భాషలలో విడుదలచేస్తున్నారు. నిఖిల్ నటించిన ‘కార్తికేయ 2’ బాలీవుడ్ లో కూడ సూపర్ సక్సస్ కావడంతో నిఖిల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీని కూడ పాన్ ఇండియా మూవీగా విడుదలచేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు.


ఇప్పుడు ఈమార్గంలోనే నితిన్ ఆఖరికి శర్వానంద్ కూడ తన సినిమాలను పాన్ ఇండియా సినిమాలుగా విడుదల చేయమని నిర్మాతలకు చెపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఈలిస్టులోకి రవితేజా కూడ చేరిపోయి తన మూవీలను కూడ బాలీవుడ్ లో డబ్ చేయమని చెపుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు టాలీవుడ్ హీరోలు అంతా పాన్ ఇండియా హీరోలుగా మారుతున్న పరిస్థితులలో కేవలం సుహాస్ కిరణ్ అబ్బవరం ప్రియదర్శి నటిస్తున్న సినిమాలు మాత్రమే కేవలం తెలుగు మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని తీస్తున్న సినిమాలుగా మారుతున్నాయి అనుకోవాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: