యంగ్ హీరో విశ్వక్ సేన్ తన సినిమాల కంటే సినిమా ఫంక్షన్స్ లో అతడు చేసే వివాదాస్పద వ్యాఖ్యలు వల్ల చాల త్వరగా గుర్తింపు పొందాడు. ఇప్పటి వరకు ఈ యంగ్ హీరోకు చెప్పుకోతగ్గ సూపర్ హిట్ రాలేదు. అయితే ఇతడు మంచి నటుడు కావడంతో ఇండస్ట్రీలో చాల త్వరగానే పెరులోకి వచ్చాడు. సినిమా హీరోల వారసత్వం గురించి అదేవిధంగా అనేక వివాదాస్పద విషయాల గురించి సంచలన వ్యాఖ్యలు గతంలో ఇతడు చేయడంతో ఇండస్ట్రీలో ఇతడికి చాల సులువుగా పేరు వచ్చింది.


లేటెస్ట్ గా అతడు నటించిన ‘ధంకీ’ విడుదలకు సిద్దంగా ఉంది. ఈ యంగ్ హీరో తానే నిర్మాతగా మారి నిర్మించిన ఈమూవీ ఫిబ్రవరిలోనే విడుదల కావలసి ఉంది. అయితే అప్పటికే విడుదలై బ్లాక్ బష్టర్ హిట్ కొట్టిన రవితేజా ‘ధమాకా’ కథకు ఈమూవీకి కొన్ని విషయాలలో పోలికలు ఉన్నట్లు గ్రహించడంతో విశ్వక్ సేన్ ఈమూవీకి సంబంధించిన కొన్ని సీన్స్ రీషూట్ చేసాడు అన్న వార్తలు కూడ వచ్చాయి.


మార్చి  నెలాఖరున విడుదల కాబోతున్న ‘దసరా’ నుండి భారీ బడ్జెట్ సినిమాల జాతర మొదలవుతోంది. ఆతరువాత వెనువెంటనే రవితేజా ‘రావణాసుర’ వచ్చేస్తోంది. ఇలా అంచనాలు బాగా ఉన్న సినిమాలు అన్నీ వరసగా క్యూ కడుతూ ఉండటంతో విశ్వక్ సేన్ సినిమాకు డేట్స్ సమస్య ఏర్పడింది. అయితే విశ్వక్ సేన్ కు కొందరు జ్యోతిష్కులు ఇస్తున్న సలహా ప్రకారం అతడి జాతక రీత్యా మార్చి 22 అన్నివిధాల బాగుంటుందని దానికితోడు ఆరోజు ఉగాది కూడ అవ్వడంతో అతడి సినిమాకు మంచి ఓపెనింగ్స్ వస్తాయని సూచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ‘ఉగాది’ బుధవారం కావడంతో మళ్ళీ వీకెండ్ రావడానికి మరొక రెండురోజులు ఆగవలసి వస్తుంది. దీనికితోడు ‘దసరా’ సినిమా కేవలం వారంరోజుల గ్యాప్ తో వస్తున్న పరిస్థితులలో తన సినిమాను రాబోయే ఉగాది రోజున విడుదల చేయాలా వద్దా అన్న కన్ఫ్యూజన్ లో విశ్వక్ సేన్ ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి..




మరింత సమాచారం తెలుసుకోండి: