సమంత గురించి ఏన్యూస్ వచ్చినా అది క్షణాలలో వైరల్ గా మారుతోంది. అలాంటిది ఆమె మెడలో చిన్న నల్లపూసల చైన్ ఆపై పసుపు తాడు తో ఆమె లుక్ కు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాకు షేర్ అయిన కొన్ని గంటలలోనే అది వైరల్ గా మారింది. దీనితో ఆమె లేటెస్ట్ లుక్ ను చూసి సమంత మళ్ళీ పెళ్ళి చేసుకుంది అంటూ సోషల్ మీడియాలో నిన్న మాతా తెగ గందరగోళం జరిగింది.


ఈగందరగోళం గ్రహించిన ఆమె పిఆర్ టీమ్ వెంటనే రంగంలోకి దిగి సమంత లేటెస్ట్ గా షూటింగ్ స్పాట్ లో ఉన్నప్పుడు తీసిన ఫోటో అని క్లారిటీ ఇచ్చారు. విజయ్ దేవరకొండతో ఆమె నటిస్తున్న ‘ఖుషీ’ మూవీ షూటింగ్ స్పాట్ లో ఒక సీన్ చిత్రీకరణ సమయంలో సమంత ఈ గెటప్ తో ఉన్నట్లు ఆమె పిఆర్ వర్గాలు తెలియచేయడంతో సమంతకు మళ్ళీ పెళ్ళి అయింది అంటూ సోషల్ మీడియాలో జరిగిన రచ్చ చల్లబడింది.


ప్రస్తుతం విజయ్ దేవరకొందతో ఆమె నటిస్తున్న ‘ఖుషీ’ మూవీ షూటింగ్ ను చాల వేగంగా పూర్తి చేసి ఈమూవీని ఈ సంవత్సరం జూలై ఆగస్టులో విడుదల చేయడానికి సమంత తనవంతు సహకారాన్ని అందించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితులు ఇలా ఉండగా ఏప్రియల్ 14న విడుదల కాబోతున్న ‘శాకుంతలం’ మూవీని దేశవ్యాప్తంగా ప్రమోట్ చేయడానికి సమంత తన శక్తియుక్తులన్నీ కూడగట్టుకుని ఈమూవీ ఘన విజయం కోసం ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు టాక్.

ఈ పరిస్థితులు ఇలా ఉంటే ‘పుష్ప 2’ లో ఒక ఐటమ్ సాంగ్ చేసే అవకాశం సమంతకు వచ్చినప్పటికీ ఆమె ఇక తాను ఏసినిమాలోను ఐటమ్ సాంగ్ చేయనని సుకుమార్ కు సున్నితంగా చెప్పడమే కాకుండా తన దృష్టి అంతా తన భవిష్యత్ సినిమాల పై ఉంది అని క్లారిటీ ఇచ్చినట్లు టాక్..

మరింత సమాచారం తెలుసుకోండి: