
ఈ మధ్య ఆయన చేసిన చాలా సినిమాల్లో కూడా డ్యూయల్ రోల్ అనేది సర్వసాధారణం అని చెప్పొచ్చు..ఒకప్పుడు బాలయ్య భైరవదీపం, ఆదిత్య 369 సినిమా లాంటి ఎంతో వైవిధ్యమైన సినిమాలు చేసేవాడు ఇప్పుడు ఆయన చేసే సినిమాలు అన్ని కూడా ఒకే టైపు లో ఉండటం చూసిన ఆడియన్స్ కూడా బాలయ్య కి డ్యూయల్ రోల్ సినిమాలు తప్ప వేరే సినిమాలు చేయడం రాదా అని అనుకుంటున్నారని తెలుస్తుంది.
అయితే మరి కొంత మంది మాత్రం ఈ విషయం లో తప్పంతా కూడా డైరెక్టర్లదే తప్ప బాలయ్య తప్పు అస్సలు లేదు అంటున్నారు ఎందుకంటే వాళ్ళు అలాంటి స్క్రిప్ట్స్ తో బాలయ్య దగ్గరికి వస్తున్నారటా.ఆయన కూడా అవే చేసుకుంటూ పోతున్నాడు.ఒకరిని మించిన మాస్ సినిమా ఒకరు చేస్తున్నారు అలా యాక్షన్ ఎపిసోడ్స్ ని ఎలివేట్ చేసుకోవడానికే బాలయ్యని రెండు పాత్రల్లో అయితే చూపిస్తున్నారు. బాలయ్య అద్భుతమైన నటుడు ఆయన్ని సరిగ్గా వాడుకోవాలి కానీ ఆయన్ని మించిన నటుడు ఎవరూ లేరు ఏ పాత్ర అయినా అద్భుతం గా చేసి చూపిస్తారు.