నాచురల్ స్టార్ నాని హీరోయిన్ కీర్తి సురేష్ నటించిన తాజా చిత్రం దసరా. ఈ చిత్రం ఈనెల 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. మొదటిసారి నాని పూర్తిగా మాస్ లుక్ లో కనిపించబోతున్నారు. ఇటీవల విడుదలైన సాంగ్స్ ట్రైలర్ అదరగొట్టేసాయని చెప్పవచ్చు. దీంతో ఈ సినిమా పైన భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఎలాగైనా ఈ సినిమాకు బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టాలని అటు నాని అభిమానులు కూడా ఆశిస్తున్నారు. ఈ సినిమాతో పాన్ ఇండియా హీరోగా పేరు పొందబోతున్నారు నాని. నాని కెరియర్ లోనే అత్యధిక భారీ బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కించడం జరిగింది.


తాజాగా ఇప్పుడు ఈ సినిమా గురించి ఒక న్యూస్ వైరల్ గా మారుతోంది. అదేమిటంటే గతంలో కూడా విజయ్ దేవరకొండ నటించిన లైగర్ సినిమాకు కూడా ఇంతే హైపు వచ్చింది. అయితే ఈ సినిమా విడుదలకు ముందు విజయ్ దేవరకొండ చాలా ఓవర్ కాన్ఫిడెంట్ తో మాట్లాడం జరిగింది. కానీ తీరా సినిమా విడుదల అయ్యాక చూస్తే ఫలితం చాలా ఘోరంగా ఉన్నది. ఇప్పుడు హీరో నాని కూడా అదే తప్పు చేస్తున్నారనే వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు కూడా బాగానే హైప్ రావడంతో పాటు నాని కూడా ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నట్లు తెలుస్తోంది.


మరి ఈ చిత్రం విజయ్ దేవరకొండ నటించిన లైగర్ సినిమా మాదిరి అవుతుందా లేకపోతే నాని అనుకున్నట్టుగానే సక్సెస్ అయ్యి నాని కెరియర్ను మారుస్తుందా అనే విషయం తెలియాలి అంటే మరో కొద్ది రోజులు ఆగాల్సిందే. ఈ చిత్రంలో నాని సరికొత్త అవతారంతో కనిపించబోతున్నారు ముఖ్యంగా వేసుకునే దుస్తులు హెయిర్ స్టైల్ ఫేస్ ఇలా అన్నీ కూడా చాలా డిఫరెంట్గా కనిపిస్తూ ఉన్నాయి. నాని కెరియర్ ఈ సినిమాతో నైనా మలుపు తిరుగుతుందేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: