ప్రెసెంట్ సభ్య సమాజంలో కేవలం ఒక్క సినీ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా ప్రతి ఒక రంగంలో కూడా కాస్టింగ్ కౌచ్ బాధితులు ఉన్నారు. ఇప్పటికీ చాలామంది ఈ కాస్టింగ్ ఎదుర్కొంటూనే ఉన్నారు.

ఐతే ఇక్కడ ఇతర రంగాలతో పోలిస్తే ఎక్కువగా సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ పేరు ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది నటీనటులు వారు ఎదుర్కొన్న కాస్టింగ్ కౌచ్ అనుభవాలను పంచుకున్న విషయం తెలిసిందే. తమపై జరిగిప లైంగిక దాడుల గురించి నటీనటులు నోరు మెదుపుతున్నారు. తాజాగా కూడా ఒక హీరోయిన్ తనని ఒక స్టార్ డైరెక్టర్ రేప్ చేశాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.

ఆమె మరెవరో కాదు  బెంగాలీ బ్యూటీ పాయల్ ఘోష్.తెలుగులో ప్రయాణం సినిమాతో హీరోయిన్ గా డెబ్యూ చేసి, ఆ తర్వాత మిస్టర్ రాస్కెల్ సినిమా సినిమా చేసింది. హీరోయిన్ గా పెద్దగా కలిసి రాకపోవడంతో ఆఖరికి ఎన్టీఆర్, తమన్నా నటించిన ఊసరవెల్లి మూవీలో ఫ్రెండ్ క్యారెక్టర్ లో కూడా నటించింది. ఆ తర్వాత సినిమా అవకాశాల కోసం ఎదురు చూసి సినిమా అవకాశాలు రాకపోవడంతో సీరియల్స్ వైపు అడుగులు వేసింది.

తర్వాత హిందీలో సీరియల్స్ చేస్తున్న సమయంలోనే మళ్లీ సినిమా అవకాశాలు వచ్చాయి. కానీ పాయల్ ఏం చేసినా వెండితెర ఆమెకు అంతగా కలిసి రాలేదు. దాంతో కొన్నాళ్ళు అవకాశాలు లేక సైలెంట్ ఉండిపోయింది.ఆ తర్వాత ఎప్పుడైతే తనను దర్శకుడు అనురాగ్ కశ్యప్ లైంగికంగా వేధించాడని కేసు పెట్టిందో, అప్పటినుండి వార్తలలో నిలుస్తూనే ఉంది పాయల్. ఈ క్రమంలో మరోసారి చర్చలకు తావిచ్చేలా కొత్త పోస్ట్పెట్టి అందరికీ షాక్ ఇచ్చింది. ఈ సందర్భంగా పాయల్ పోస్ట్చే స్తూ.. సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో నేను ఇద్దరు నేషనల్ అవార్డు విన్నింగ్ డైరెక్టర్స్ తో వర్క్ చేశాను. స్టార్ హీరో ఎన్టీఆర్ తో కూడా కలిసి పని చేశాను. ఎన్టీఆర్ చాలా జెంటిల్ మెన్. నన్ను సౌత్ డైరెక్టర్స్, హీరోలు ఎవరూ కూడా అసభ్యంగా టచ్ చేసే ప్రయత్నం కూడా చేయలేదు. కానీ బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ కలిసిన మూడో మీటింగ్ లోనే రేప్ చేశాడు. ఇప్పుడు చెప్పండి నేను సౌత్ ఇండస్ట్రీని ఎందుకు పొగడకూడదు? అని ప్రశ్నించింది పాయల్. ఐతే ప్రెసెంట్ పాయల్ ఘోష్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో, సినీ వర్గాలలో హాట్ టాపిక్ గా మారాయి.

ఐతే ఇదేమి సినీ ఇండస్ట్రీ లో కొత్తెమీ కాదని ఎప్పటి నుండో ఉన్నదేనని కొంత మంది నెటిజన్లు చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: