
పుష్ప -1 అనుకోని రీతిలో పెను సంచలనాన్ని అందుకోవడం తో పుష్ప -2 చిత్రాన్ని భారీగా తెరకెక్కించాలని చిత్ర బృందం ఫిక్స్ అయింది. తెలుగుతోపాటు ఇతర భాషలోని ప్రేక్షకులను కూడా ఆకట్టుకునే విధంగా ఉండేలా మేకర్స్ ఈ సినిమాలో ప్లాన్ చేస్తున్నారు. దీనికోసం వివిధ భాషలలోని నటులను పుష్పాటూ చిత్రంలో తీసుకోబోతున్నారని వార్తలు వినిపించాయి. ముఖ్యంగా హీరోయిన్ సాయి పల్లవి కూడా ఇందులో నటిస్తోందని వార్తలు వచ్చాయి. సాయి పల్లవి పుష్ప చిత్రంలో కీలకమైన పాత్రలో నటించబోతోంది అంటూ వార్తలు రావడం పై తాజాగా ఈమె క్లారిటీ ఇవ్వడం జరిగింది.
తాగాకు ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను పుష్ప చిత్రంలోని సెకండ్ పార్టీ లో అసలు నటించలేదు.. అలాగే ఈ సినిమాలో ఉన్నానని అన్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అంటూ తెలుపుతోంది. పుష్ప కంటే పుష్ప -2 మరింత బాగుంటుందని చాలామంది భావిస్తున్నారు. ముఖ్యంగా సాంగ్స్ డైలాగ్స్ కూడా అందరిని ఆకట్టుకునే విధంగా ఉంటాయని అంచనాలు వేస్తున్నారు. 2024 వేసవిలో ఈ సినిమా విడుదల చేయాలని భావిస్తున్నారట రష్యాలో కూడా పుష్ప చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు సమాచారం. దేశవ్యాప్తంగా పుష్ప సినిమా 300 కోట్ల రూపాయలను కలెక్షన్ చేయగా.. మరి పుష్ప టు చిత్రం ఎన్ని కోట్లు కలెక్షన్ చేస్తుంటే చూడాలి మరి.