ధమాకా, వాల్తేరు వీరయ్య వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో మంచి జోష్ మీదున్న మాస్ మహారాజ రవితేజ ఇప్పుడు 'రావణాసుర' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. స్వామి రారా ఫేమ్ సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 7న థియేటర్స్ లో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, సాంగ్స్ కి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇక రావణాసురులో రవితేజ నెగిటివ్ షేడ్స్ కలిగిన పాత్రలో కూడా కనిపించబోతున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. అంతేకాదు ఈ సినిమాలో పది తలల రావణాసురుడికి ఆలోచనలు రవితేజ పాత్రలో ఉంటాయట. అయితే తాజాగా ఈ సినిమా రీమేక్ మూవీ అని వార్తలు వైరల్ అవుతున్నాయి. 

సినిమా కథ అప్పట్లో మణిరత్నం దర్శకత్వంలో విక్రమ్, పృథ్వీరాజ్ నటించిన రావణ్ సినిమా ఛాయలు కనిపిస్తున్నాయని చెబుతున్నారు. ఇదే విషయాన్ని తాజాగా దర్శకుడు సుధీర్ వర్మను అడిగితే.. ఇది రీమేక్ సినిమా కాదు అంటూ.. ఆ సినిమా వేరు అంటూ మణిరత్నం కథ రామాయణం కథ. కానీ ఈ రావణాసుర రామాయణం కు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. అయితే బెంగాల్ భాషలోని ఓ సినిమాకు రీమేక్ గా రావణాసుర సినిమాను తీశారని వార్తలు ప్రచారం అవుతున్నాయని సుధీర్ వర్మను అడిగితే.. ఆ సినిమా నేను చూడలేదు. చూస్తే మీకే తెలుస్తుంది. అది చూడాలంటే ఏప్రిల్ ఏడో తేదీ వరకు ఆగాల్సిందే' అంటూ చెప్పుకొచ్చారు.

ఒకవేళ మీరు సినిమా చూశాక రీమేక్ సినిమా అని తెలితే 8వ తేదీ ఈ సినిమాపై పూర్తి చర్చలో పాల్గొందామని దర్శకుడు సుధీర్ వర్మ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. మరి రవితేజ నటించిన రావణాసుర మూవీ బెంగాల్ సినిమాకు రీమేకా? కాదా? అని తెలియాలంటే ఏప్రిల్ 7 వరకు వేచి చూడాల్సింది. అభిషేక్ పిక్చర్స్,  RT టీం వర్క్స్ బ్యానర్స్ పై అభిషేక్, రవితేజ సంయుక్తంగా ఈ సినిమా నిర్మించారు. హర్షవర్ధన్ సంగీతం అందించిన ఈ సినిమాలో రవితేజ సరసన మెగా ఆకాష్, అను ఇమ్మానియేల్, దక్ష నగర్కర్, ఫారియా అబ్దుల్లా, పూజిత పొన్నాడ హీరోయిన్స్ గా నటించారు. అలాగే హీరో సుశాంత్ మరో కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఇక ఈ సినిమాతో రవితేజ తన హిట్ ట్రాక్ ని కంటిన్యూ చేస్తాడేమో చూడాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: