మాస్ మహారాజా గా టాలీవుడ్ లో పేరు తెచ్చుకున్న రవితేజ ఈ మధ్యకాలంలో చేసే సినిమాలు ఏవి కూడా అంత హిట్ అవ్వడం లేదు. ధమాకా సినిమా తర్వాత ఈయన చేసిన సినిమాలన్నీ యావరేజ్,ఫ్లాప్ తప్ప ఒక్కటైన హిట్ కాలేదు. అలా రవితేజ నటించిన ఈగల్, మిస్టర్ బచ్చన్ వంటి సినిమాలు అట్టర్ ప్లాప్ అయ్యాయి.ఇక ఆ మధ్యకాలంలో వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమా హిట్ అయినప్పటికీ అది చిరంజీవి సినిమా కాబట్టి ఆ క్రెడిట్ మొత్తం ఆయనకే వెళ్లిపోయింది. ప్రస్తుతం రవితేజ అభిమానులు అందరూ మాస్ జాతర సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు. అలా ధమాకా మూవీకి సీక్వెల్ గా మాస్ జాతర సినిమాలో కూడా హీరయిన్ గా శ్రీలీలనే నటిస్తోంది.ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన టీజర్,పోస్టర్,సాంగ్స్ ఇలా ప్రతి ఒక్కటి అభిమానులను ఆకట్టుకున్నాయి. అయితే తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటిస్తూ రవితేజ కి సంబంధించిన హెల్త్ ఇష్యూస్ కూడా బయట పెట్టారు.

తాజాగా మాస్ జాతర సినిమా అక్టోబర్ 31న విడుదల కాబోతున్నట్టు అఫీషియల్ గా ప్రకటించారు చిత్ర యూనిట్. ఇందులో భాగంగా ఒక ఫన్నీ వీడియో కూడా పోస్ట్ చేశారు.ఆ వీడియోలో ఏముందంటే.. జబర్దస్త్ హైపర్ ఆది రవితేజ దగ్గరికి వచ్చి మన సినిమా ఎప్పుడు రిలీజ్ అన్నా అని అడగగా.. సంక్రాంతికి అని రవితేజ చెబుతారు.ఆ తర్వాత సంక్రాంతికి వచ్చి అడిగితే సాంగ్ షూట్ చేసేటప్పుడు భుజానికి ఇంజ్యూరీ అయింది అని చెబుతాడు. ఆ తర్వాత  సమ్మర్లో రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం మే 9న మన సినిమా రాబోతోంది అని చెబుతారు.ఆ తర్వాత మే 9 కూడా వచ్చేసింది అన్నా..సినిమా ఇంకెప్పుడు రిలీజ్ అని ఆది అడగగా.. ఫైట్ సీక్వెన్స్ చేసేటప్పుడు కాలుకు ఇంజ్యూరీ అయిందని చెప్పి ఇన్ని సినిమాల్లో నటించాను.. ఇన్ని ఇంజ్యూరీలు నాకు ఎప్పుడు కాలేదు ఆది అంటూ రవితేజ చెప్తాడు.ఆ తర్వాత  ఆగస్టు 27 వినాయక చవితికి ఫిక్స్ అంటూ చాలా క్లారిటీగా చెప్తాడు.

ఇక వినాయక చవితి కూడా వచ్చేసింది అన్నా అంటూ హైపర్ ఆది చేతిలో వినాయకుడి విగ్రహం పట్టుకొని ఇంకెప్పుడు అన్న సినిమా రిలీజ్ అని అడగగా.. రవితేజ ఫోన్లో మాట్లాడుతూ.. చింటూ మన సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది.. సంక్రాంతి,సమ్మర్,వినాయక చవితి అన్ని అయిపోయాయి. నన్ను ఇక్కడ చావదొబ్బుతున్నారు అంటూ అడుగుతాడు. ఆ తర్వాత ఫోన్ కట్ చేసి అక్టోబర్ 31 పక్కా విడుదలవుతుంది. ఈ దేవుడి మీద ఒట్టేసి చెబుతున్నాను అంటూ వినాయకుడి మీద ఒట్టేసి రవితేజ చెబుతారు. అలా సినిమా రిలీజ్ డేట్ ని ఇలా వెరైటీగా వీడియో రూపంలో చేశారు. ఇక ఈ వీడియోలో రవితేజ మాస్ జాతర సినిమా షూటింగ్ సమయంలో తనకి జరిగిన ఇంజ్యూరీలు బయట పెట్టడంతో ఈ విషయం కాస్త వైరల్ గా మారింది. మరి ఇన్నిసార్లు వాయిదా పడుతూ వస్తున్న సినిమా అక్టోబర్ 31 అయినా విడుదలవుతుందా లేక మళ్ళీ వాయిదా పడుతుందా అంటూ ఈ వీడియో చూసిన నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: