తమిళ స్టార్ హీరో తలపతి విజయ్ ప్రస్తుతం లియో అనే మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో త్రిష విజయ్ కి జోడిగా కనిపించబోతుంది. ఈ మూవీ కి మా నగరం ... ఖైదీ ... మాస్టర్ ... విక్రమ్ మూవీ లతో  పాన్ ఇండియా రేంజ్ లో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న లోకేష్ కనకరాజు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ కి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు.

మూవీ షూటింగ్ చాలా రోజుల క్రితమే ప్రారంభం కాగా ... ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ చాలా వరకు పూర్తయింది. ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో ప్రస్తుతం జరుగుతుంది. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ ని అక్టోబర్ 19 వ తేదీన విడుదల చేయనునట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమా నుండి ఒక వీడియోను కూడా ఈ మూవీ బృందం విడుదల చేసింది. ఈ వీడియో ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండడంతో ఈ వీడియోకు ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ షూటింగ్ షెడ్యూల్ కు సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ యొక్క కొత్త షెడ్యూల్ షూటింగ్ ఈ రోజు నుండి చెన్నైలో ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ తాజా షెడ్యూల్లో కీలక సన్నివేశాలను ఈ మూవీ యూనిట్ చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే మాస్టర్ మూవీ తర్వాత విజయ్ ... లోకేష్ కాంబినేషన్ లో రూపొందుతున్న మూవీ కావడంతో ఈ మూవీ పై తమిళ సినీ ప్రేమికులు భారీ లెవెల్లో అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: