ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన సంగీత దర్శకుడుగా గొప్ప గుర్తింపును సంపాదించుకున్న ఏ ఆర్ రెహమాన్ గురించి ప్రత్యేకం గా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే రెహమాన్ ఇప్పటికే ఎన్నో మూవీ లకు సంగీతాన్ని అందించి తన అద్భుతమైన సంగీతంతో ఎన్నో సినిమా విజయలలో కీలక పాత్రను పోషించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇది ఇలా ఉంటే తన అద్భుతమైన సంగీతంతో ఇప్పటికే రెహమాన్ ఆస్కార్ అవార్డును కూడా దక్కించుకున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రపంచ వ్యాప్తంగా మ్యూజిక్ డైరెక్టర్ గా గొప్ప పేరును సంపాదించుకున్న రెహమాన్ తెలుగు లో మాత్రం చాలా తక్కువ మూవీ లకు మ్యూజిక్ ను అందించాడు. ఇప్పటి వరకు రెహమాన్ కేవలం 3 స్ట్రీట్ తెలుగు మూవీ లకు మాత్రమే సంగీతం అందించాడు. ఆ మూడు మూవీ లు ఏవో తెలుసుకుందాం.

సూపర్ పోలీస్ : విక్టరీ వెంకటేష్ హీరోగా నగ్మా హీరోయిన్ గా నటించిన ఈ మూవీ కి కే మురళీ మోహన్ రావు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ కి రెహమాన్ సంగీతం అందించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయం పాలయ్యింది.

నాని : సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందిన ఈ మూవీ లో అమీషా పటేల్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ కి ఎస్ జె సూర్య దర్శకత్వం వహించాడు.  ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్యూర్ రిజల్ట్ తెచ్చుకుంది.

కొమరం పులి : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఈ మూవీ లో నికిషా పటేల్ హీరోయిన్ గా నటించింది. ఎస్ జే సూర్యమూవీ కి దర్శకత్వం వహించాడు.  ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాన్ని అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: