మాస్ మహారాజా రవితేజ హీరోగా.. సుధీర్ వర్మ దర్శకత్వంలో ఏప్రిల్ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా రావణాసుర.. అయితే ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ కూడా కలెక్షన్ల పరంగా అనుకున్నంత స్థాయిలో కలెక్షన్స్ వసూలు చేయలేకపోయింది. ఇక మొదటి రోజు డీసెంట్ ఓపెనింగ్స్ మాత్రమే వచ్చాయి. కానీ రెండవ రోజు నుంచి మూవీ కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయనే చెప్పాలి. కేవలం ఎనిమిది రోజుల్లో రూ.11.81 కోట్ల షేర్ మాత్రమే రాబట్టింది ఈ సినిమా..

ఇక గ్రాస్ లెక్కల్లో గనుక చూసుకున్నట్లయితే రూ.21.40 కోట్లు మాత్రమే లభించాయి.  గత రెండు సినిమాలైనా వాల్తేరు వీరయ్య,  ధమాకా సినిమాలు గ్రాస్ పరంగా రూ.100 కోట్ల క్లబ్ లో చేరి దూసుకుపోతుంటే.. ధమాకా అయితే నిర్మాతకు కూడా భారీ లాభాలను తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలోనే రావణాసుర సినిమాకి కూడా రవితేజ కెరియర్ లోనే హైయెస్ట్ బిజినెస్ జరగడం గమనార్హం. రూ. 22.20 కోట్ల బిజినెస్ జరిగింది.  ఈ సినిమాకి రూ.23 కోట్ల బ్రేక్ ఈవెన్ మార్కెట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా. ఇక ఈ సినిమా ట్రైలర్,  టీజర్ హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ తో ఉండడంతో పాటు మాస్ మహారాజా ఈ సినిమాలో కంప్లీట్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో మొదటిసారి కనిపించాడు. అందుకే అంచనాలు కూడా పూర్తిగా పెరిగిపోయాయి.

రిలీజ్ అయిన మొదటి ఆటకి మంచి పాజిటివ్ టాక్ వచ్చింది.  కానీ కలెక్షన్లు మాత్రం డ్రాప్ అయిపోయాయి. ఇక రవితేజ కెరీర్ లోనే బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఈ సినిమాలో ఇచ్చాడని అదిరిపోయే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ సినిమాలో చాలా ఉన్నాయని రివ్యూలు కూడా వచ్చాయి.  కానీ ఎవరు సినిమాను పట్టించుకోలేదు.  ఇకపోతే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే ఇంకా రూ. 10.5 కోట్లు రాబట్టాలి. ఇకపై ఓవరాల్ గా రూ. 50 లక్షలు రావడమే గగనంగా మారింది. ఈ నేపథ్యంలోనే నిర్మాతలకు రూ.10 కోట్ల నష్టం తప్పడం లేదని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: