కొన్ని సంవత్సరాలుగా మీడియాకు అదేవిధంగా సినిమాలకు దూరంగా ఉంటున్న మంచు మనోజ్ మౌనిక ను పెళ్ళి చేసుకున్న తరువాత తన స్పీడ్ ను పెంచాడు. 'భార్యకు ప్రేమతో కానుక' అంటూ ఒక వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసాడు. అది షేర్ అయిన కొద్ది సేపటికే వైరల్ గా మారింది. ఆవీడియోకి సంబంధించిన ప్రేమ్స్ కలరింగ్ ఎడిటింగ్ అన్నీ బాగున్నాయి అన్న కామెంట్స్ వస్తున్నాయి.



అదేవిధంగా ఈవీడియోకి రాజమణి అందించిన సంగీతం కూడ బాగుంది అంటూ ప్రశంసలు వస్తున్నాయి. అయితే ఈ వీడియోలో తన అన్న మంచు విష్ణు కు అతి స్వల్ప ప్రాధాన్యత ఇవ్వడంతో ఇప్పుడు మళ్ళీ వీరిద్దరి మధ్య ఉన్న గ్యాప్ పై సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. నాలుగు నిమిషాలకు పైగా నిడివి ఉన్న వీడియోలో మంచు విష్ణు ఒకే ఒకసారి కనిపించడం చాలామందిని ఆశ్చర్య పరిచింది.  



ఆమధ్య ‘అన్నయ్య అరాచకం’ అంటూ మనోజ్ ఒక వీడియోను పోస్ట్ చేసి వెంటనే డిలీట్ చేసిన విషయం తెలిసిందే. దీనితో వీరిద్దరి మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ మరొకసారి బయటపడింది. పెళ్ళి వీడియోలో ఒక అన్నకు ఇవ్వవలసిన ప్రాధాన్యత ఇంతేనా అంటూ కొందరు మనోజ్ ను కార్నర్ చేస్తూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.


ఈపరిస్థితులు ఇలా ఉండగా మంచు మనోజ్ తన భార్యతో కలిసి వెన్నెల కిషోర్ హోస్ట్ చేస్తున్న షోలో కూడ కొన్ని ఆశక్తికర కామెంట్స్ చేసాడు. తన జీవితంలో తన తండ్రి తల్లి అక్క కు సమస్యలు కలిగించేలా తన ప్రవర్తన ఉండ కూడదు అంటూ దేవుడుని కోరుకున్న మంచు మనోజ్ అక్కడ కూడ తన అన్న మంచు విష్ణు ప్రస్తావన తీసుకు రాలేదు. ఇది ఇలా ఉంటే రాబోతున్న ఎన్నికలలో మనోజ్ భార్య ఎన్నికలలో పోటీ చేసే అవకాశాలు ఉండటంతో మనోజ్ తన భార్యకు కు సపోర్ట్ గా రాజకీయాలలో బిజీగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి..  



మరింత సమాచారం తెలుసుకోండి: