టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున కుమారుడు అక్కినేని అఖిల్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు ఎన్నో తెలుగు మూవీ లలో నటించిన అఖిల్ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ యువ హీరో ఏజెంట్ అనే యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు.

మూవీ ని ఈ నెల 28 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా బృందం ఈ మూవీ యొక్క ట్రైలర్ ను విడుదల చేసింది. ఈ ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది. ఈ రోజు వరంగల్ లో ఈ చిత్ర బృందం ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించబోతోంది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు నాగార్జున ముఖ్య అతిథిగా విచ్చేయబోతున్నాడు.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గానీ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గానీ ... వీలైతే ఇద్దరూ కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. తాజాగా ఈ వార్తపై స్పందించిన అఖిల్ "ఏజెంట్" మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు చరణ్ ... ప్రభాస్ వస్తున్నారని నాకు తెలియదు. వారికి ఈ సినిమా ట్రైలర్ ను పంపాను ... బాగుంది అన్నారు అని అఖిల్ చెప్పుకొచ్చాడు. ఇది ఇలా ఉంటే ఏజెంట్ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఏజెంట్ మూవీ ఏ రెంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: