ప్రస్తుతం ఈయన ఐసీయూలో వెంటిలేటర్ పైన చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది మరికొన్ని గంటలు గడిస్తే తప్ప ఈయన ఆరోగ్య పరిస్థితి పూర్తిగా చెప్పలేమని వైద్యులు తెలియజేస్తున్నారు. ఈ రోజు సాయంత్రం మరొకసారి శరత్ బాబు ఆరోగ్య పరిస్థితి గురించి హెల్త్ బుల్లెట్ విడుదల చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. తెలుగులో ఎన్నో చిత్రాలలో నటించిన శరత్ బాబు టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. దాదాపుగా ఇప్పటివరకు 200 కు పైగా సినిమాలలో నటించారు. కేవలం హీరో గానే కాకుండా అనేక చిత్రాలలో కూడా సహాయక నటుడి పాత్రలో కూడా నటించడం జరిగింది.
తాజాగా వికె నరేష్ నటించిన మళ్లీ పెళ్లి అనే సినిమాలో కూడా నటించారు ఈయన కృష్ణ గారి పాత్రలో నటించినట్లు తెలుస్తోంది. కేవలం నరేష్ కోరిక మేరకే ఈ సినిమాలో కాదనలేక నటించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక షూటింగ్ నిమిత్తం శరత్ బాబు హైదరాబాద్ టు చెన్నై వంటి ప్రాంతాలకు తరచూ వెళ్తూ ఉండేవారు. ఇక శరత్ బాబు భార్య రమ ప్రభ.. అయితే కొన్ని కారణాల చేత వీరిద్దరూ విడిపోవడం జరిగింది. గతంలో కూడా శరత్ బాబు పైన ఎన్నో విమర్శలు కూడా వినిపించాయి. ప్రస్తుత మైతే శరత్ బాబు ఆరోగ్యం చాలా క్లిష్టంగానే ఉందని వైద్యులు తెలియజేసినట్లు సమాచారం. పూర్తి సమాచారం తెలియాలి అంటే సాయంత్రం వరకు ఆగాల్సిందే.