ఇండియాలో అత్యంత క్రేజ్ కలిగిన దర్శకులలో ఒకరు అయినటు వంటి మణిరత్నం తాజాగా పొన్నియన్ సెల్వన్ అనే మూవీ కి దర్శకత్వం వహించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ యొక్క మొదటి భాగం పోయిన సంవత్సరం తమిళ్ , తెలుగు , కన్నడ , మలయాళం , హిందీ భాషలలో విడుదల అయింది. ఈ మూవీ యొక్క తమిళ వర్షన్ ప్రేక్షకులను బాగానే ఆకట్టు కున్నప్పటికీ ఇతర భాష ప్రేక్షకులను మాత్రం ఈ సినిమా అంతగా అకట్టు కోలేక పోయింది.

 ఇది ఇలా ఉంటే మొత్తంగా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీ యొక్క రెండవ భాగం నిన్న అనగా ఏప్రిల్ 28 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా పర్వాలేదు అనే రేంజ్ అంచనాల నడుమ తమిళ్ , తెలుగు , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ మొదటి భాగంపై ఉన్నంత అంచనాలు రెండవ భాగం పై ప్రేక్షకుల్లో లేవు అని చెప్పవచ్చు. ఈ మూవీ మొదటి భాగంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్న కారణంగా ఈ మూవీ యొక్క మొదటి భాగానికి ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు 80 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు వచ్చాయి.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ యొక్క రెండవ భాగానికి మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా కేవలం 53 కోట్ల కలెక్షన్ లు మాత్రమే వచ్చాయి. దీనిని బట్టి చూసుకుంటే ఈ మూవీ మొదటి భాగంతో పోలిస్తే రెండవ భాగం 27 కోట్ల తక్కువ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టింది. ఈ మూవీ లో చియాన్ విక్రమ్ , కార్తీ , జయం రవి , ఐశ్వర్య రాయ్ , త్రిష , శోభిత ధూళిపాల , ఐశ్వర్య లక్ష్మి ముఖ్య పాత్రలలో నటించగా ... ఏ ఆర్ రెహమాన్ ఈ మూవీ కి సంగీతం అందించాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: