తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఆరేళ్ళ క్రితం పాన్ ఇండియా సినిమాగా విడుదలైన బాహుబలి ప్రపంచ వ్యాప్తంగా ప్రభంజనం సృష్టించింది .

ఇక తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాలు దాటించింది.. నిజం చెప్పలంటే తెలుగు సినిమాను వర్ణించాలంటే బాహుబలి సినిమాకు ముందు బాహుబలి సినిమా తర్వాత అనే విధంగా టాలీవుడ్ ప్రేక్షకులు చెప్పుకుంటారు .. ఆ సినిమా విడుదల వరకు తెలుగు సినిమాలపై చిన్న చూపు చూసిన బాలీవుడ్ ప్రేక్షకులు బాహుబలి టిక్కెట్ల కోసం కొట్టుకున్నారు. డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి-2' సినిమా క్రియేట్ చేసిన రికార్డు అలాంటిది.. నిజమైన పాన్ ఇండియా హిట్గా నిలిచి ఆ తర్వాత ఎన్నో చిత్రాలకు పాన్ ఇండియా దారి చూపించింది. ఆ బాటలోనే కేజీఎఫ్ సిరీస్ సహా ఎన్నో సినిమాలు సౌత్ ఇండియా నుంచి వచ్చి పాన్ ఇండియా లెవల్లో రికార్డులు సృష్టించయని చెప్పడంలో అతియోక్తి లేదు..

ఇక రాజమౌళి టేకింగ్, డార్లింగ్ నటనకు జనాలు వెర్రెత్తిపోయారు. రానా విలనిజంకు ఫిదా అయ్యారు. ఇలా ఒక్కరిద్దరూ కాదు సినిమాలోని ప్రతీ నటుడు ది బెస్ట్ ఇచ్చారనే చెప్పలి. అప్పటివరకు రెండొందల కోట్లు కూడా దాటని టాలీవుడ్ సినిమా బాహుబలితో ఏకంగా వెయ్యి కోట్ల క్లబ్లో చేరి చరిత్ర సృష్టించింది. ఇప్పటికీ ఇండియాలో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమా రికార్డు బాహుబలి-2 పేరిటే ఉంది. ఈ సినిమా విడుదలై నెటికి ఆరేళ్ళు.... ఎంతో ఇండియన్ గా గర్వించతగ్గ ఈసినిమాపై కొంతమంది కోలివుడ్ ఫ్యాన్స్ తక్కువ చేస్తూ మాట్లాడుతూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు...నేడు మణిరత్నం తెరకెక్కించిన పొన్నియన్ సెల్వన్-2 విడుదలైంది..

ఇక బాహుబలి కంటే పొన్నియన్ సెల్వన్ 2 చాలా గొప్ప సినిమా అని ట్వీట్లు చేస్తున్నారు. దీంతో టాలీవుడ్ కన్నడీయులపై కన్నెర్ర చేస్తున్నారు .. టాలీవుడ్- కోలీవుడ్ ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియా వార్ ఓ రేంజ్ లో జరుగుతుంది.. అయితే ఒక సినిమా గొప్పగా, బాగుంది అని చెప్పుకోవడంలో తప్పు లేదు కావచ్చు కానీ అరవ ఫ్యాన్స్ మాత్రం ఎక్కువే చేస్తున్నారని చెప్పాలి.. సోషల్ మీడియా వేదికగా పొన్నియన్ సెల్వన్-2 సినిమా బాహుబలి-2 లాంటి చెత్త సినిమా కంటే వేయి రెట్లు బెటర్ అంటూ పిచ్చి వాగుడు వాగుతున్నారు. నిజము చెప్పాలంటే పీఎస్-2 తీసిన డైరెక్టర్ మణిరత్నమే చాలా సార్లు బాహుబలి గూర్చి గొప్పగా మాట్లాడారు. అంతెకాకుండా పొన్నియన్ సెల్వన్ తీయడానికి బాహుబలి సినిమానే ధైర్యం అని తానే స్వయంగా చెప్పారు. ఆఖరికి ఇది కూడా మర్చిపోయి కొంతమంది కోలివుడ్ ఫ్యాన్స్ బాహుబలిపై విషప్రచారం చేస్తున్నారు.హ్యాష్ ట్యాగ్తో ట్వీట్లు చేస్తున్నారు. ఈ ట్వీట్లు చూసి తెలుగు ఫ్యాన్స్ గుస్సా అవుతున్నారు .. సరిగ్గా ఆరేళ్ల క్రితం ఇదే రోజు విడుదలై బాక్సాఫీస్ దుమ్ముదులింధీ.. భారతీయ సినిమాకు గౌరవం దక్కేలా చేసింది అలంటి బాహుబలి-2 గూర్చి లా మాట్లాడతారా అంటూ ఫైర్ అవుతున్నారు .. పొన్నియన్ సెల్వన్-2 సినిమాను ట్రోల్ చేస్తున్నారు.  హ్యాష్ ట్యాగ్ను ట్రెండ్ చేస్తున్నారు. అంతే కాకుండా పొన్నియన్ సెల్వన్ చూస్తుంటే థియేటర్లో నిద్రొస్తుందని ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.. ఇలా ట్విట్టర్ వేదికగా రచ్చ మొదలు పెట్టిన ఆరవ ఫ్యాన్స్ గ్రహించాల్సిన విషయము ఏంటంటే . వాళ్ల సినిమా వీళ్ల సినిమా అని కాదు ఇది ఇండియన్ సినిమా అని తెలుసుకోవాలి.. బాహుబలి-2 అయినా పొన్నియన్ సెల్వన్-2 సినిమా అయినా రెండూ మనవాళ్లు తీసినవే. జక్కన్న , మణిరత్నం లో ఒకరు ఎక్కువ , ఒకరు తక్కువ అనే వార్ పక్కనపెట్టి.. ఇద్దరు కూడా ట్రెమడంస్ డైరెక్టర్లు తీసిన సినిమాలే అని అనుకోవాలి.. అంతేకాకుండా భారత సినీ పరిశ్రమ గర్వించే సినిమాలు మరోన్నో రావాలని కోరుకోవాలి.ఇది పక్కన పెట్టి మేమె ఎక్కువ మేమె ఎక్కువ అని అరుస్తున్నారు ఆరవవాళ్ళు చూడాలి మరి.. వరల్డ్ వైడ్ గా ఫాన్స్ ని సొంతము చేసుకున్న డార్లింగ్ గూర్చి ఇలాంటి మాటలు బయటకు వస్తుంటే  ఫాన్స్ ఊరుకుంటారా  ఈ రచ్చ ఎంత దూరం వెళ్తుందో. ఎంతవరకు దారి తీస్తుందో.

మరింత సమాచారం తెలుసుకోండి: