మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికే ఈ సంవత్సరం వాల్టేరు వీరయ్య అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ లో చిరంజీవి సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా మైత్రి సంస్థ వారు ఈ మూవీ ని నిర్మించారు. మాస్ మహారాజ రవితేజ ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో నటించగా ... రవితేజ కు భార్య పాత్రలో ఈ సినిమాలో క్యాథరిన్ నటించింది. ప్రకాష్ రాజ్ ... బాబి సింహమూవీ లో విలన్ పాత్రలలో నటించగా ... రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతం అందించాడు.

 బాబి కొల్లి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ భారీ అంచనాల నడుమ ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 13 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ మూవీ అదిరిపోయే రేంజ్ కలక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేసి భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసుకుంది.

ఇది  ఇలా ఉంటే ప్రస్తుతం చిరంజీవి ... మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతున్న భోళా శంకర్ అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ ని ఏ కే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర నిర్మిస్తున్నాడు. ఈ మూవీ లో కీర్తి సురేష్ ... చిరంజీవి కి చెల్లెలు పాత్రలో నటిస్తూ ఉండగా ... సుశాంత్మూవీ లో ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని ఆగస్టు 11 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం చాలా రోజుల క్రితమే ప్రకటించింది. కాకపోతే ఈ మూవీ ని విడుదల తేదీ మారే అవకాశాలు ఉన్నాయి అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: