తమిళ సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరో లలో ఒకరిగా కెరియర్ కొనసాగిస్తున్న అజిత్ గురించి ప్రత్యేకం గా తెలుగు సినీ ప్రేమికు లకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . అజిత్ ఇప్పటికే ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీ లలో నటించి తమిళ సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరో గా కొనసాగుతున్నాడు . అలాగే ఈ హీరో ఇప్పటికే తాను నటించిన ఎన్నో మూవీ లను తెలుగు లో కూడా విడుదల చేసి టాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్నాడు .

 ఆజిత్ ఆఖరుగా తునివూ అనే తమిళ మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ ని తెలుగు లో తెగింపు పేరుతో విడుదల చేశారు. ఈ సినిమా అటు తమిళ్ ఇటు తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయా న్ని అందుకుంది. ఈ మూవీ కి హెచ్ వినోద్ దర్శకత్వం వహించగా ... బోనీ కపూర్మూవీ ని భారీ బడ్జెట్ తో నిర్మించాడు. ఈ సినిమా ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 11 వ తేదీన థియేటర్ లలో తమిళ్ మరియు తెలుగు భాషల్లో విడుదల అయింది.

 ఇది ఇలా ఉంటే తెగింపు మూవీ విడుదల అయ్యి ఇప్పటికే చాలా కాలం అవుతున్న అజిత్ తన తదుపరి మూవీ కి సంబంధించిన ఎలాంటి అప్డేట్ ను ప్రకటించ లేదు. ఇది ఇలా ఉంటే అజిత్ ఇప్పటికే తన నెక్స్ట్ మూవీ కి సంబంధించిన అన్ని కార్య క్రమాలను పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. తన తదుపరి మూవీ కి సంబంధించిన అప్డేట్ ను అజిత్ ఈ రోజు రాత్రి చేయనున్నట్లు తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ అజిత్ కెరియర్ లో 62 వ రూపొందబోతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: