టాలీవుడ్ యంగ్ హీరోలలో మంచి క్రేజ్ కలిగిన హీరో అయినటు వంటి సాయి ధరమ్ తేజ్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పిల్ల నువ్వు లేని జీవితం మూవీ తో ప్రేక్షకులను పలకరించి అద్భుతమైన విజయాన్ని అందుకొని మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈ యువ హీరో ఆ తర్వాత సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ , చిత్రలహరి , సుప్రీమ్ , ప్రతి రోజు పండగే , సోలో బ్రతికే సో బెటర్ వంటి పలు విజయవంత మైన మూవీ లలో హీరో గా నటించి ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న యంగ్ హీరో గా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ యువ హీరో విరూపాక్ష అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించగా ... కార్తీక్ దండు ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా భారీ అంచనాల నడుమ ఏప్రిల్ 21 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా విడుదల అయిన ఫస్ట్ డే ఫస్ట్ షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సాలిడ్ పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ మూవీ కి అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లు ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కుతున్నాయి. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ఇప్పటి వరకు బాక్స్ ఆఫీస్ దగ్గర 9 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ 9 రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 35.12 కోట్ల షేర్ కలక్షన్ వసూలు చేసింది.

ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు సాయి తేజ్ కెరియర్ లో ప్రతిరోజు పండగే సినిమా 34.06 కోట్ల షేర్ కలక్షన్ లతో టాప్ లో ఉంది. ఈ సినిమాను వెనక్కు నెట్టుతు విరూపాక్ష సినిమా 9 రోజుల్లోనే 35.12 కోట్ల షేర్ కలక్షన్ లను వసూలు చేసి సాయి తేజ్ కెరియర్ లో టాప్ షేర్ కలెక్షన్ లని వసూలు చేసిన మూవీ గా నిలిచింది.


మరింత సమాచారం తెలుసుకోండి: