అంతేకాకుండా నాలుగేళ్లుగా తామిద్దరము కలిసి ఉన్నామంటూ ప్రకటించారు. వీరిద్దరూ కలిసి మళ్లీ పెళ్లి అనే చిత్రంలో కూడా నటిస్తున్నారు.. వీరి బంధానికి సూపర్ స్టార్ ఫ్యామిలీ సపోర్టు ఉందా లేదా అని అనుమానాలు అందరిలోనూ కలుగుతున్నాయి.. అయితే ఇలాంటి వార్తలకు నరేష్ చెక్ పెట్టినట్లుగా తెలుస్తోంది. పవిత్రతో తన బంధాన్ని మహేష్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలిపారు. తన తండ్రి కృష్ణతో పాటు సోదరుడు మహేష్ కూడా ముందు నుంచి ఈ బంధం గురించి తెలుసని తెలియజేయడం జరిగింది.
వారు తమ బంధానికి కూడా ఓకే చెప్పారని అందరికీ ఇష్ట ప్రకారమే మేము వివాహం చేసుకోబోతున్నాం అన్నట్టుగా తెలిపారు. మహేష్ కృష్ణ అమ్మ విజయనిర్మల తామంతా ఒకటే కుటుంబమని స్పష్టం చేశారు.. అంతేకాకుండా తనకు తెలుగు రాదని తెలిసి కృష్ణ పవిత్రతో ఇంగ్లీషులోనే మాట్లాడే వారిని కూడా పవిత్ర తెలియజేయడం గమనార్హం.. ముఖ్యంగా పవిత్ర లోకేష్ చేసిన వంటలను కృష్ణ గారు బాగా ఎక్కువగా తింటూ ఉండేవారని తన కుటుంబం మొత్తానికి పవిత్ర ఫుడ్ ప్రిపేర్ చేస్తూ ఉండేదని నరేష్ తెలియజేయడం జరిగింది అందరూ తమ బంధాన్ని అంగీకరించినందుకు తనకు చాలా సంతోషంగా ఉందంటు తెలిపారు వీకే నరేష్.