టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన మన మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు. హాలీవుడ్ డైరెక్టర్ల నుంచి నటన విషయంలో ప్రశంసలు పొందిన చరణ్ కు హాలీవుడ్ సినిమాల నుంచి కూడా ఆఫర్లు వస్తున్నాయి.

ఇక ఇండియాలో ఎక్కడికి వెళ్ళినా రామ్ చరణ్ కు బ్రహ్మరథం పడుతున్నారు ప్రేక్షకులు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రామ్ చరణ్ కు గౌరవాన్ని అందిస్తూ.. ఉత్సవాలకు ఆహ్వానిస్తున్నారు. తాజాగా చరణ్ కు జీ 20 లో పాల్గొనే అరుదైన అవకాశం లభించింది.

జమ్ము కశ్మీర్ లోని శ్రీనగర్ లో జరుగుతున్న జీ 20 సదస్సులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పాల్గొననున్నారు. అందుకోసం ఇప్పటికే ఆయన శ్రీనగర్ చేరుకున్నారు. ఈ సమ్మిట్ కు ప్రత్రేక ప్రతినిదిగా ఆయన హాజరుకానున్నారు. అంతే కాదు ఈ సదస్సు తరువాత ఆయన టూరిజం వర్కింగ్ గ్రూప్ మీట్ లో కూడా అంతర్జాతీయ ప్రతినిధులతో భేటీ కాబోతున్నారు. వివిధ దేశాల నుంచి వచ్చిన సెలబ్రెటీలు, ప్రముఖులు ఈ సమావేశంలో ఫిల్మ్ టూరిజం, ఎకో ఫ్రెండ్లీ టూరిజంపై చర్చించనున్నారు. జమ్మూకశ్మీర్ లో అందుబాటులో ఉన్న అవకాశాలు, ప్రోత్సాహకాలపై చర్చ జరగనుందని అధికారులు ఇప్పటికే వెల్లడించారు. మన దేశంలో టూరిజం పరంగా ఉన్న అవకాశాల గురించి ఇందులో చర్చించబోతున్నారు.

జమ్మూకశ్మీర్ లోని శ్రీనగర్ లో జరుగుతున్న జీ 20 సదస్సు కోసం ఇప్పటికే రామ్ చరణ్ శ్రీనగర్ కు చేరుకున్నారు. ఇప్పటికే ఈ సదస్సులో చరణ్ పాల్గొన్నారు. సాయుధ దళాల సెక్యూరిటీ మధ్య ఈ మీట్ అట్టహాసంగా ప్రారంభమైంది. వివిధ దేశాల నుంచి వచ్చిన సెలబ్రెటీలు ఈ సమావేశంలో ఫిల్మ్ టూరిజం, ఎకో ఫ్రెండ్లీ టూరిజంపై చర్చించనున్నారు. ఈ సందర్భంగా సినిమా షూటింగ్ ల కోసం సింగిల్ విండోను అభివృద్ధి చేయనున్నట్లు వివరించారు. కాగా, ఈ సదస్సుకు ధర్మం, నెట్ ఫ్లిక్స్ ప్రతినిధులు కూడా హాజరయ్యారు. ఈ సదస్సుకు మెగా హీరో రామ్ చరణ్ కూడా హాజరుఅవ్వడంతో ఆయన ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. చరణ్ కు దక్కిన ఈ అరుదైన గౌరవాన్ని తలుచుకుని మురిసిపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: