‘ధమాక’ ‘వాల్తేర్ వీరయ్య’ లు ఇచ్చిన సూపర్ సక్సస్ ఆనందం రవితేజా కు ‘రావణాసుర’ ఫెయిల్యూర్ తో పూర్తిగా తుడిచి పెట్టుకు పోయింది. దీనితో మాస్ మహారాజా నుండి త్వరలో రాబోతున్న ‘టైగర్ నాగేశ్వరరావు’ మూవీని ఎట్టి పరిస్థితులలోను హిట్ చేసి తీరాలని రవితేజా చాల పట్టుదల పై ఉన్నాడు.


దీనితో ఈసినిమా ప్రమోషన్ ను చాల డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నారు. సాధారణంగా సినిమాల ఫస్ట్ లుక్ ను సోషల్ మీడియా ద్వారా విడుదల చేస్తూ ఉంటారు. ఫస్ట్ లుక్ టీజర్ ప్రమోషన్ కోసం భారీ ఫంక్షన్స్ పెట్టిన సందర్భాలు చాల తక్కువ. అయితే టైగర్ నాగేశ్వరావు విషయంలో చాల డిఫరెంట్ గా చేస్తున్నారు. ఈమూవీ ఫస్ట్ లుక్ టీజర్ ఫంక్షన్ రాజమహేంద్రవరంలో అత్యంత భారీ స్థాయిలో ఘనంగా విడుదల చేయబోతున్నారు.


ఈ ఫంక్షన్ కు ఈసినిమా యూనిట్ అంతా హాజర్ కాబోతోంది. పాన్ ఇండియా మూవీగా విడుదల చేయబోతున్న ఈమూవీ టీజర్ కు తెలుగులో వెంకటేష్ కన్నడంలో శివ రాజ్ కుమార్ తమిళంలో కార్తీక్ హిందీలో జాన్ అబ్రహిం లు వాయస్ ఓవర్ లు ఇవ్వడం ఇప్పుడు టాపిక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. స్టూవర్ట్ పురం దొంగగా పేరు గాంచిన ‘టైగర్ నాగేశ్వరరావు’ గురించి చాల కథలు ప్రచారంలో ఉన్నాయి.


ధనవంతులను దోచుకుని పేదవారికి పంచిపెట్టిన ‘టైగర్ నాగేశ్వరావు’ జీవితంలోని యదార్థ సంఘటనలను ఆధారంగా చేసుకుని ఈమూవీని నిర్మించారు. ఈమూవీలో చాల కాలం తరువాత రేణు దేశాయ్ రవితేజా సోదరిగా నటిస్తోంది. నుపూర్ సనన్ గాయిత్రి భరద్వాజ్ లు హీరోయిన్స్ గా నటించిన ఈమూవీ రవితేజా కు మొట్టమొదటి పాన్ ఇండియా మూవీ కావడంతో ఈమూవీ విజయం రవితేజా పాన్ ఇండియా మార్కెట్ కు అత్యంత కీలకంగా మారింది. ప్రస్తుతం ఎంత ప్రమోట్ చేసినప్పటికీ ఏసినిమా సక్సస్ అవుతుందో ఎవరికీ తెలియని పరిస్థితులలో ఈమూవీ ఫలితం గురించి ఇండస్ట్రీ వర్గాలు ఆశక్తిగా ఎదురు చూస్తున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: