సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమాతో అటు టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ కాస్త పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు అన్న విషయం తెలిసిందే. అంతేకాదు స్టైలిష్ స్టార్ కాస్త ఐకానిక్ స్టార్ గా మారిపోయాడు. ఇక ఇప్పుడు పుష్ప 2 సినిమాతో గ్లోబల్ స్టార్ గా మారెందుకు సిద్ధమవుతున్నాడు అల్లు అర్జున్. ఇక పుష్ప సినిమాకు సీక్వెల్ గా వస్తున్న పార్ట్ 2 సినిమా షూటింగ్లో బిజీ బిజీగా ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాపై అభిమానుల్లో భారీ రేంజ్ లోనే అంచనాలు నెలకొన్నాయి.


 ఈ సినిమాకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ బయటికి వచ్చినా కూడా అది తెగ హాట్ టాపిక్ గా మారిపోతుంది అని చెప్పాలి. అయితే ఒకప్పటిలా ఈ మధ్యకాలంలో మాత్రం బన్నీ ఎక్కడ బయట కనిపించడం లేదు. ఒకవేళ షూటింగ్లో గ్యాప్ దొరికితే ఇక ఫ్యామిలీతో వెకేషన్కు వెళ్లి ఎంజాయ్ చేస్తున్నాడు. అలాంటి బన్నీ ఇటీవలే ఆహా ఓటీటి వేదికగా నిర్వహిస్తున్న తెలుగు ఇండియన్ ఐడల్ కార్యక్రమంలో మెరిసాడు. ఇటీవల ఇందుకు సంబంధించిన ప్రోమో కాస్త విడుదలైంది అని చెప్పాలి.  అతిరథ సంగీత విద్వాంసుల మధ్య బన్నీ ఫైనల్ ఎపిసోడ్ కు జడ్జిగా వచ్చాడు. ఎందుకు సంబంధించిన ప్రోమో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. ఇక బన్నీ ఈ ప్రోమోలో తనదైన శైలిలోనే కామెడీ పంచులతో రెచ్చిపోయాడు అని చెప్పాలి. ఇక ఈ ప్రోమోలో అల్లు అర్జున్ మాట్లాడుతూ ఇలాంటి సింగింగ్ షో కి జడ్జిగా రావడం  తన అదృష్టమంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఫైనల్ కంటెస్టెంట్స్కు ఆల్ ది బెస్ట్ చెప్పాడు.. వారి పాటలు వింటుంటే తన కాళ్లు ఆగడం లేదు. డాన్స్ చేయాలనిపిస్తుంది. కానీ ఒక జడ్జి స్థానంలో వచ్చాను కాబట్టి ఆ పెద్దరికం తనను ఆపేస్తుంది. అందుకే డాన్స్ చేయాలనే తన కోరికను ఆపేసుకున్నట్లు చెబుతూ పెద్దగా నవ్వేసాడు అల్లు అర్జున్.

మరింత సమాచారం తెలుసుకోండి: