పొన్నియన్ సెల్వన్ సినిమాలో వందియదేవన్ గా మెప్పించిన కార్తి త్వరలోనే 'జపాన్' సినిమాతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆయన దగ్గరికి వచ్చిన సినిమా ల్లో చేరి పాత్రలోకి ఇట్టే చేరి పరకాయ ప్రవేశం చేసి అందరినీ మరిపిస్తాడు కార్తి. ఆయన నటించిన పలు సినిమాలు ఇప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించని స్థాయిలో విజయాన్ని అందుకున్నాయి. కొన్ని మాత్రం డిజాస్టర్లు మిగిలినప్పటికీ ఆయన నటనతో అందరినీ ఆకట్టుకుంటారు కార్తి .ఇప్పటికే తమిళ స్టార్ హీరోగా కొనసాగుతున్న తన అన్న సూర్య కన్నా మిన్నగా తెలుగు నాట ఆదరణ పొందుతున్నాడు కార్తి. కార్తీ తండ్రి శివకుమార్ తమిళ స్టార్ హీరోగా ఉన్న రోజుల నుండి కార్తికి సినిమాలంటే మంచి ఇష్టం.

కానీ అప్పట్లో కార్తీ దర్శకునిగా ఫోకస్ పెట్టాడు. జనాలకి బాగా కనెక్ట్ అయ్యే సినిమాలన్నీ తీయాలని ఆశపడ్డాడు. అనంతరం దర్శకుడుగానే కాకుండా నటుడిగా కూడా అందరికీ పరిచయం కావాలని అనుకున్నాడు .సినిమాలో సూర్య నటించినప్పుడు అతనికి ఓ తమ్ముడు ఉన్నాడని దర్శకుడు మణిరత్నం కార్తిని పరిచయం చేశాడు. అప్పట్లో బొద్దుగా ఉన్న కార్తిని చూసి ముందుగా అనుకున్న పాత్ర కోసం కాకుండా వేరే పాత్ర కోసం పెట్టారు. ఇక ఆ సినిమాకు కార్తీ అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నాడు. అనుకోని విధంగా కార్తీ పరుత్తవీరన్ సినిమాతో హీరో అయ్యాడు. దాని అనంతరం ఆయనలో నటించి హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.

ఇక ఈ సినిమాలో హీరోగా నటించిన కార్తి తెలుగులో ఈ సినిమాని యుగానికి ఒక్కడుగా తెరకెక్కించారు. దాని తర్వాత వెంటనే లింగు స్వామి దర్శకత్వంలో  తమన్నతో కలిసి నటించిన పయ్య సినిమా సైతం ఘనవిజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా తెలుగులో ఆవారాగా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. అప్పటినుండి తమిళంలో ఆయన నటించిన సినిమాలను తెలుగులో సైతం డబ్ చేస్తూ విడుదల చేస్తున్నారు .దాంతో సూర్య కంటే కార్తిని తెలుగువారికి బాగా దగ్గరయ్యాడు .అనంతరం ఊపిరి సినిమాలో నాగార్జునతో కలిసి నటించాడు.ఆ సినిమా సైతం మంచి విజయాన్ని దక్కించుకుంది. ఇలా వరుస సినిమాలు చేస్తూ విజయాలను అందుకుంటున్న కార్తి ఇప్పుడు రాబోయే జపాన్ సినిమాతో ఈ రేంజ్ లో ఆకట్టుకుంటాడో చూడాల్సి ఉంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: