శత్రువులు రెండు రకాలుగా ఉంటారు బయట కనిపించే శత్రువులతో పోరాడటం చాల సులువు. అయితే కనిపించని అంతః శత్రువులతో పోరాటం చేసి విజయం సాధించడం అంత సులువైన పని కాదు. అలసట అజ్ఞానం భయం అహం మొహమాటం మతి మరుపు ఇలా ఇవన్నీ మన అంతః శత్రువులు.


నిరంతరం మన జీవితంలో ఎదురయ్యే పరిస్థితులతో రాజీపాడమని మనలను పరోక్షంగా ప్రేరేపిస్తూ ఉంటాయి. అందుకే ఈ అంతః శత్రువులతో పోరాటం చేసి విజయం సాధించిన వ్యక్తికి మాత్రమే సంపద వస్తుంది. ‘మనిషి గా బతకడం కోసం మనం చాల కష్ట పడాలి. లేకపోతే మనం అంతకన్నా అధమంగా బతకవలసి వస్తుంది’ అంటూ జార్జి బెర్నాడ్ షా తన రచనలలో పెరోన్నాడు.


ఒక వ్యక్తి విజయం సాధించి ఐశ్వర్య వంతుడు కావాలి అంటే తాను నమ్మినది నిర్భయంగా చెప్పగల సమర్థత ఉంటేనే ఆ వ్యక్తి తాను ఎంచుకున్న రంగంలో రాణించి విజయం సాధించడమే కాకుండా ధన సంపాదన విషయంలో తాను పెట్టుకున్న గోల్ ను చేరుకో గలుగుతాడు. అయితే దీనికి నిరంతరం ఆత్మ విశ్లేషణ చేసుకుంటూ ఆత్మన్యూనత భావన నుండి దూరంగా ఉండగలగాలి.


ఏ వ్యక్తి అయితే తనకు తాను ప్రేమించుకుని తనకు తాను గౌరవించుకుని తనకు తాను నిరంతర ఆత్మవిశ్లేషణ చేసుకోగలుగుతాడో ఆ వ్యక్తి మాత్రమే విజేత అవ్వగలడు. అందుకే సరిదిద్దుకోలేని తప్పు జరిగినా దాన్ని చిరునవ్వుతో అధికమించగల వ్యక్తికి మాత్రమే విజయం వచ్చి తద్వారా ఐశ్వర్యం వస్తుంది. ముఖ్యంగా మనలను చూసి మనం ద్వేషించుకోవడం మనకు మనం సిగ్గు పడటం మనతో మనం రాజీ పడటం అనే మూడు అవలక్షణాల నుండి మనం బయటకు రాగలిగినప్పుడే విజయం దరి చేరుతుందని మనీ విశ్లేషకులు చెపుతూ ఉంటారు. వ్యాపారం ఆట ప్రేమ జీవితం వివాహం స్నేహం విద్య ఇలా అన్ని విషయాలలోనూ వచ్చే గెలుపు ఓటమి లను సమానంగా స్వీకరించే మనస్తత్వం ఏర్పడాలి అంటే ముందుగా ఆత్మన్యూనత భావం నుండి బయటపడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: