మన పై మనం విజయం సాధించాలి అంటే మనకు విపరీతమైన ఆత్మవిశ్వాసం ఉండితీరాలి. విశ్వాసం లేనివాడు ఏ పని సాధించలేడని నెపోలియన్ హిల్ భావన. మనం విజయ లక్ష్యాలను చేరుకోలేము అన్న భయం నుంచి బయటపడాలి అంటే ఖచ్చితంగా ప్రతి వ్యక్తి కి ఆత్మవిశ్వాసం ఉండి తీరాలి.


మన మనసులో ఉండే శక్తివంతమైన కోరికలు తీరకుండా అడ్డుపడే శక్తి పిరికితనం. ఆత్మవిశ్వాసంలోనే బలమైన నమ్మకం ఇమిడి ఉంటుంది. ఒక పనిలో మనం విజయం సాధించేందుకు మానసికంగా సిద్ధపడాలి అంటే ఆత్మవిశ్వాసం ఉండి తీరాలి. అనుమానంతో ఉండే వ్యక్తులు ఏ విషయంలోనూ ముందడుగు వేయలేరు. ఆత్మవిశ్వాసమే లేకపోతే కొలంబస్ ప్రపంచానికి ఉండే మార్గాలను కనిపెట్టలేకపోయేవాడు.


ఒక క్రమబద్ధమైన ప్రణాళిక ఉన్నా తెలివితేటలు ఉన్నా ఆత్మవిశ్వాసం లేనివారు జీవితంలో రాణించలేరు. నమ్మకం అనేది లేకుండా రిస్క్ చేసినా అది రాణించదు. ఏ విషయంలో అయినా తాను విజయం సాధిస్తాను అన్న నమ్మకం లేకపోతే థామస్ ఎడిసెన్ విద్యుత్ బల్బు ను కనిపెట్టలేకపోయి ఉండేవాడు. కొన్ని వందల సార్లు ఫెయిల్ అయినప్పటికీ థామస్ ఎడిసెన్ కు ఈ ఆత్మవిశ్వాసమే ప్రధాన కారణం. కొన్ని సందర్భాలలో వైఫల్యాలు కూడ మనిషికి ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తాయి.


ఆత్మవిశ్వాసం అంటే ఒక పదం మాత్రమే కాదు అది ఒక నిర్దిష్ట ప్రణాళిక. ఈ విశ్వాసం ఉన్నప్పుడే ఇప్పటివరకు మనం చేయలేని పనులను చేయడానికి ప్రయత్నాలు చేస్తాము. ఈ విశ్వాసంతోనే మన భయాల నుండి బయటకు రాగలుగుతాము. విమర్శల పై భయం అనారోగ్యం పీడిస్తుందనే భయం దారిద్రం గురించే ఆలోచనలు వృద్ధాప్యం గురించి ఆలోచనలు మరణం పై భయాలు ఇలా ఎన్నోరకాల భయాలు మన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయేలా చేస్తూ ఉంటాయి. అయితే ఈ లక్షణాలకు లొంగకుండా పోరాటం చేయగల వ్యక్తికి విపరీతమైన ఆత్మవిశ్వాసం ఉండాలి. అప్పుడే అన్ని మార్గాలలో విజయం సాధించి ఆపై సంపద చేకూరుతుంది..


 

మరింత సమాచారం తెలుసుకోండి: