మనసు అనేది ఒక ప్రయోగశాల అయితే అందులో నమ్మకమే ప్రధాన రాసాయనం. నమ్మకానికి ఆలోచన కూడ తోడైతే అది జ్ఞానంలోకి రూపాంతరం  చెంది అది ఒక ప్రార్థన లా మారి మన పై మనకు విశ్వాసాన్ని కలిగిస్తూ మనకు విజయాన్ని ఇస్తుంది.


నమ్మకం అనేది ఒక మానసిక స్థితి ఆ మానసిక స్థితి లేకుండా ఎంతటి గొప్ప వ్యక్తి అయినా ఏ విషయాన్ని సాధించలేరు. ఒక ప్రఖ్యాత మనస్తత్వ శాస్త్రవేత్త అభిప్రాయం ప్రకారం మన జీవితంలో జరిగే సంఘటనలు మన నమ్మకం పైనే ఆధారపడి ఉంటాయి అన్న అభిప్రాయం కలుగుతుంది. ఒక పని పదేపదే చేయడం అలవాటుగా మార్చుకుంటే ఆ అలవాటు మనకు విశ్వాసాన్ని కలిగించి ఆ విశ్వాసం నుంచి మనకు విజయం లభిస్తుంది.


అయితే నమ్మకం వేరు ఆలోచనలు వేరు. ఆ ఆలోచనలు అన్నీ అనుభూతులుగా మారి వాటికి నమ్మకంతోడైతే వెంటనే అవి భౌతిక రూపంలో మారిపోయి విజయంతో పాటు ఐశ్వర్యాన్ని కలిగిస్తాయి. అనుభూతులు చైతన్యాన్ని కలిగిస్తే నమ్మకం భౌతికమైన విజయాన్ని కలిగిస్తుంది. అయితే నమ్మకానికి ఆలోచనలను జతచేసి దానికి సామర్ధ్యాన్ని కూడ జోడించగల వ్యక్తి మాత్రమే ధనవంతుడు కాగలుగుతాడని మనీ ఎక్స్ పర్ట్స్ చెపుతున్నారు.


వాస్తవానికి చాలామంది తాము వైఫల్యానికే అంకితం అయిపోయామని తాము నష్ట జాతకులం అనీ భావిస్తూ ఉంటారు. అయితే నష్ట జాతకులు అన్న పదం కేవలం మన నమ్మకానికి సంబంధించింది మాత్రమే. ఎంతటి నష్ట జాతకుడు అయినా తాను చేసే ప్రయత్నం పై నమ్మకం ఉంచుకోగలిగితే ఖచ్చితంగా ఎదో ఒక సందర్భంలో విజయం సాధించి ఐశ్వర్య వంతుడు కాగలుగుతాడు. అందుకే నమ్మకానికి పట్టుకొమ్మ స్వీయోపదేశం అని అంటారు. ప్రతివ్యక్తి తనని తాను విశ్వసించుకోవడమే స్వీయోపదేశం. అందుకే నమ్మకం అనేది ఒక సంజీవని లాంటిది అని చెపుతూ ఉంటారు. సర్వ సంపదలకు మూలమైన నమ్మకాన్ని పోగొట్టుకోకుండా జీవితంతో పోరాటం చేయగలిగిన వ్యక్తి మాత్రమే ధనవంతుడు కాగలడు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: