మనుషులు వారివారి స్వభావం రీత్యా చాల విభిన్నంగా ఉంటారు. మనిషి వ్యక్తిత్వంలో అనేక కోణాలు ఉంటూ మనిషి స్వార్థ పరుడుగా సెంటిమెంటలిస్టు గా మొహమాటస్తుడు గా సేవాతత్పరుడు గా వీటన్నిటికంటే ముఖ్యంగా మెటీరియలిస్ట్ గా విభిన్న కోణాలలో మనిషి ప్రవర్తిస్తూ ఉంటాడు. 


మెటీరియలిస్టు అంటే కరుడుకట్టిన హృదయం కలవాడు అస్తమిస్తున్న సూర్యుడుని చూసినా టైమ్ వృథా అని భావించే వ్యక్తి అని అందరు సర్వసాధారణంగా భావిస్తూ ఉంటారు. అయితే మెటీరియలిస్టు ఎక్కువగా తన ఆనందానికి ప్రాముఖ్యత ఎక్కువగా ఇస్తూ ఉంటాడు. ఎదుటి వ్యక్తికి ఏదైనా ఇచ్చే విషయంలో తనకు ఎంతలాభం ఉంది అని అనిపిస్తేనే సహాయపడుతూ ఉంటాడు.


ఇలాంటి మెటీరియలిస్టులు అంతా ధనవంతులు అయిపోతారు అనుకుంటే చాల పొరపాటు. మనిషి ఐశ్వర్య వంతుడు కావడానికి ఒక్క మెటీరిలిజం మాత్రమే సరిపోదు. కేవలం స్వార్థంతో తనకు ఏ పనిలో అయినా వచ్చేది ఎంత తను ఇచ్చేది ఎంత అని లెక్కలు చూసుకునే కేవలం స్వార్థపరులుగా మిగిలిపోతారు కాని ధనవంతులు కాలేరు. ఒక వ్యక్తి ధనవంతుడుగా మారాలి అంటే చాల విశాల హృదయం ఉండాలి. ప్రతి పనిని లాభ నష్టాలతో బేరీజువేసుకుని గెలుపంటే ఇతరులను తన స్వార్ధం కోసం వాడుకోవడమే అని భావించే ఏవ్యక్తి అయినా ధనవంతుడుగా మారిన సందర్భాలు కనిపించవు. 


అందువల్లనే మానవ సంబంధాలు పరిపూర్ణంగా నెరవేర్చలేని వ్యక్తి ఐశ్వర్య వంతుడు కాలేడు. మెటీరియలిస్టుకు తన జీవితానికి సంబంధించి గమ్యం ఉండదు. కేవలం ఆరోజు గడిచిపోతే చాలు అని అనుకుంటాడు. ఇలాంటి మనస్తత్వం డబ్బు సంపాదనకు ఏమాత్రం పనికిరాదు. మానవ సంబంధాలను గౌరవించే వ్యక్తిత్వం లేకుండా మనం ఎన్నిప్రయత్నాలు చేసినా విజయంలభించదు అని అంటారు ప్రతి మానవ సంబంధం చాల గొప్పది. ఆ సంబంధంలోని ఆనందాన్ని ఆస్వాదించే స్థాయికి ఎదగగలిగినప్పుడు మాత్రమే వ్యాపారంలో అయినా ఉద్యోగంలో అయినా రాణించి తాను ఎంచుకున్న ఆర్ధికపరమైన గోల్ ను చేరుకోగలుగుతాడు. అప్పుడే ఐశ్వర్య వంతుడు కాగలడు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: