కరోనా దెబ్బతో ప్రపంచ వ్యాప్తంగా వ్యాపారాలు అన్నీ దెబ్బతిన్నాయి. కార్పరేట్ కంపెనీల షేర్ల విలువ హారతి కర్పూరం లా కరిగిపోయింది. అయితే ఇలాంటి వ్యతిరేక పరిస్థితులలో కూడ వ్యాక్సిన్ కింగ్ గా పేరున్న డాక్టర్. ఎస్. పూనావాలా కు మాత్రం ఈ కరోనా కాలం బాగా కలిసి వచ్చి అతడికి ప్రపంచ కుభేరుల స్థానాలకు సంబంధించిన లిస్టులో స్థానాన్ని పొందేలా చేసింది.


పూణే లోని సీరమ్ ఇన్స్టిట్యూట్ ప్రపంచంలో అతిపెద్ద వ్యాక్సిన్ ఉత్పత్తి సంస్థ. దీని అధిపతి అయిన పూనావాలా కు ఈ కరోనా కాలం కలిసి వచ్చి వ్యాపారంలో వందల కోట్లు లాభాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం కరోనా సమస్య తీవ్రతరం అయి ఈ వ్యాధి నుంచి తప్పించుకోవడం ఎవరితరం కాదు అన్న అభిప్రాయాలు చాలామందికి రావడంతో కరోనా వైరస్‌కు ప్రత్యేక వ్యాక్సిన్ ఔషధాల కోసం ముమ్మర పరిశోధనలు కొనసాగుతున్నాయి.


ఈ నేపథ్యంలో ప్రముఖ ఆయుర్వేద ఉత్పత్తుల సంస్థ అధిపతి రాందేవ్ బాబా రూపొందించిన ‘కరోనిల్’ పేరుతో తయారుచేసిన ఔషధం మార్కెట్ లోకి విడుదల అయితే రానున్న రోజులలో రాందేవ్ బాబా కంపెనీ సంపద ముఖేష్ అంబాని సంపదను దాటిపోయినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు. తాము తయారు చేసిన ఈ కరోనా వైరస్ నియంత్రణ డ్రగ్ లో దివ్యఅశ్వగంధ గిలోయ్ తులసి తో కలిపి తాము ఈ డ్రగ్ ను పతంజలి రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ జైపూర్‌ లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సంయుక్తంగా రూపొందించినట్టు తెలియచేస్తున్నారు. ప్రస్తుతం జనంలో పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల పై ఏర్పడిన నమ్మకంతో ఈ కరోనా డ్రగ్ కు కూడ విపరీతమైన డిమాండ్ ఏర్పడే ఆస్కారం ఉంది. తాము తయారుచేసిన మందుతో కేవలం 5 నుంచి 14 రోజుల్లో కోవిడ్‌ ను నయం చేయగలమని రాందేవ్ బాబా మాటలకు మీడియా విపరీతమైన ప్రచారం కల్పిస్తోంది.


అయితే ఈ డ్రగ్ ఎలా తయారుచేసారు అన్న విషయం పై తమకు వివరణ కావాలని భారత ప్రభుత్వానికి చెందిన ఆయుష్ శాఖ వేస్తున్న ప్రశ్నలకు సరైన సమాధానాలు రాందేవ్ బాబా ఇవ్వగలిగితే వచ్చే ఏడాదికి ముఖేష్ అంబాని స్థానంలో రాందేవ్ బాబా రావడం ఖాయం అంటూ విశ్లేషకులు చెపుతున్న అభిప్రాయాలను బట్టి కరోనా మందులతో కొందరి సంపద ఏవిధంగా పెరగబోతోందో సంకేతాలు వస్తున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: