ప్రస్తుతం ఇండియాలో 5 లక్షల సంఖ్యను దాటినా కరోనా వైరస్ రోగుల సంఖ్య రాబోతున్న సెప్టెంబర్ కు 20 కోట్ల స్థాయికి చేరినా ఆశ్చర్యం లేదు అంటూ కొన్ని అంచనాలు వస్తున్న పరిస్థితులలో రానున్నరోజుల్లో భారత్ లో సగటున జనాభాలో ప్రతి ఐదు మందికి ఒకరికి కరోనా వచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు.


ఇలాంటి పరిస్థితులలో సామాన్యుల నుండి సెలెబ్రెటీల వరకు ఇలా అందరినీ కరోనా భయాలు ముంచెత్తే వేస్తున్నాయి. ఈ పరిస్థితులలో ఈసమస్యలకు పరిష్కారంగా రాబోతున్న ‘కరోనా రక్షక్’ పాలసీకి ‘భారత భీమా నియంత్రణ అభివృద్ధి మండలి’ లైన్ క్లియర్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో రానున్న జూలై 10వ తారీఖు నుండి అనేక హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఈ కరోనా రక్షక్ పాలసీలను ప్రవేశ పెట్టబోతున్నాయి.


ఈ పాలసీ భీమా కవరేజ్ 50 వేల నుండి 5 లక్షల వరకు ఉంటుంది. ఈ పాలసీకి  18 నుండి 65 సంవత్సరాల లోపు వారు అందరు అర్హులే. అయితే ఈ పాలసీ మొత్తం కుటుంబానికి సంబంధించింది కాకుండా ఎవరికి వారు చేయించుకోవాలి. ఈపధకం కాలపరిమితి మనం కట్టే ప్రీమియం బట్టి ఆధారపడి ఉంటుంది. ఈ పాలసీ వెయిటింగ్ పిరియడ్ 15 రోజులు ఈ పాలసీ కట్టిన 15 రోజుల లోపు కరోనా వస్తే ఈ పాలసీ వర్తించదు.


ఈ పాలసీ వల్ల ఎవరైనా వారికి ఇష్టమైన కార్పోరేట్ హాస్పటల్ చేరి 15 రోజుల వరకు ఖర్చు పెట్టిన వైద్య ఖర్చులు హాస్పటల్ రూమ్ రెంట్ తో పాటు ఈ కరోనా వ్యాధి సోకిన కుటుంబం రోజు ఖర్చుల నిమిత్తం భీమా కవరేజ్ మొత్తంలో 0.5 శాతం చిల్లర ఖర్చులు నిమిత్తం ఇవ్వబోతున్నారు. ఈ పాలసీ తీసుకున్న వ్యక్తులు తనకు నచ్చిన అలోపతి ఆయుర్వేద హొమియోపతీ నేచురోపతి వైద్యాల లో ఏవైద్యాన్ని అయినా ఎంచుకుని కరోనా సమస్య నుండి బయటపడవచ్చని ఈ కరోనా రక్షక్ పాలసీ విధి విధానాలు తెలియచేస్తున్నాయి. ఇప్పుడు ఈ పాలసీ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలకు కోట్లు కురిపించబోతున్నాయని మనీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు..    

 

మరింత సమాచారం తెలుసుకోండి: