రిజర్వ్ బ్యాంక్ రెపో రేట్లను మార్చక పోవడంతో ఉత్సాహంలోకి వెళ్ళిపోయిన బీఎస్ఈ సెన్సెక్స్ చరిత్రలో తొలిసారిగా 45 వేల మైలు రాయిని అందుకోవడం స్టాక్ మార్కెట్ చరిత్రలో ఒక కొత్త రికార్డును క్రియేట్ చేసింది. వాస్తవానికి భారత ఆర్ధిక వ్యవస్థ ప్రస్తుతం -7.5 శాతంలో ప్రతికూల వృద్ధిలో ఉన్నప్పటికీ కరోనా భయాలు తగ్గిన తరువాత ప్రస్తుతం షేర్ మార్కెట్ లో 179.5 లక్షల కోట్లు సంపద దేశీయ స్టాక్ మార్కెట్ లో ఉంది అంటే ప్రస్తుతం మదుపర్ల కు షేర్ మార్కెట్ పై ఎలాంటి నమ్మకం ఏర్పడిందో అర్ధం అవుతుంది.


మొన్న శుక్రు వారంతో ముగిసిన బర్గర్ కింగ్ ఐపీఓ కు అపూర్వమైన స్పందన రావడమే కాకుండా ఆ కంపెనీ ఇష్యూ సైజ్ తో పోలిస్తే 156.65 రెట్లు బిడ్లు దాకలు కావడం మార్కెట్ వర్గాలలో ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇప్పటికే ఆల్ టైమ్ గరిష్ట స్థాయిలలో కదలాడుతున్న సూచీలు మరింత ర్యాలీలో పరుగులు తీస్తూ మధ్యమధ్య వచ్చే కరెక్షన్స్ మధ్య నిలదొక్కుకుని ముందుగా 47 వేల స్థాయికి చేరుకొని ఆ తరువాత 50 వేల స్థాయికి చేరుకునే ఆస్కారం ఉంది అన్న అంచనాలు వస్తున్నాయి.


అయితే ప్రస్తుతం మార్కెట్ లోకి చిన్న తన తరహా ఇన్వెస్టర్లు మాత్రం ప్రస్తుతం చాల షేర్లు అందని ద్రాక్ష పండ్లు లా ఉన్నాయని అసంతృప్తి వ్యక్త పరుస్తున్నారు. అయితే ఈ పరుగుల మధ్య అత్యుతాహంతో చిన్న తరహా మధ్య తరహా ఇన్వెస్టర్లు పరుగులు తీయడం మంచిది కాదనీ షేర్ మార్కెట్ కు సంబంధించి మరో రెండు మూడు వారాలలో భారీ కరెక్షన్ వచ్చే ఆస్కారం ఉందని ఆ తరువాత మళ్ళీ షేర్ మార్కెట్ మరింత పుంజుకుంటుంది అన్న మాటలు వస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న కాంటాక్ట్ లెస్ లావాదేవీల పరిమితిని 5వేల వరకు పెరగడంతో దేశ వ్యాప్తంగా ఉన్న కోట్లాదిమంది డెబిట్ వినియోగ దార్లకు తమ కార్డుకు సంబంధించిన పిన్ నెంబర్లకు మరింత బద్రత ఏర్పడుతుందని అంచన..

మరింత సమాచారం తెలుసుకోండి: