గత కొన్ని వారాలుగా లాభాల బాటలో నడుస్తున్న ఇండియన్ స్టాక్ మార్కెట్ నిన్న ఎవరు ఊహించని విధంగా కుప్పకూలి పోవడంతో వేలకోట్లు గాలిలో కలిసిపోయాయి. ఈ ఊహించని పరిణామానికి ప్రధాన కారణం. ఇంగ్లాండ్ లో పుట్టుకు వచ్చిన కొత్త వైరస్ అని అంటున్నారు.
ప్రపంచాన్ని ఒక కుదుపు కుదిపిన కరోనా వైరస్ చైనా నుంచి వస్తే ఈ కొత్త వైరస్ ‘స్ట్రెయిన్’ బ్రిటన్ పుట్టుకు వచ్చింది. బ్రిటన్ తో పాటు అనేక దేశాలలో ఒకేసారి ఈ కొత్త వైరస్ కేసులు వెలుగు చూడటంతో ఇప్పుడు ప్రపంచంలోని అన్ని దేశాలు ఎలర్ట్ అయిపోతున్నాయి. ఇప్పటికే బ్రిటన్ నుండి వచ్చే విమానాల పై అనేక దేశాలు నిషేధం ప్రకటించిన పరిస్థితులలో ఈ ప్రభావం స్టాక్ మార్కెట్ పై విపరీతంగా పడటంతో స్టాక్ మార్కెట్ కుప్ప కూలింది.
బిఎస్ఇ సెన్సెక్స్ 1000 పాయింట్ల పైన పడిపోతే నిఫ్టీ సుమారు 376 పాయింట్లు పైగా పడిపోవడంతో ఏ గ్రేడ్ బి గ్రేడ్ షేర్లు అన్నీ ఒకేరోజు పతనం కావడంతో నిన్నటి సోమవారం షేర్ మార్కెట్ లో బ్లాక్ మండే గా మారింది. కరోనా వైరస్ భారత్ లోకి ఎంటర్ అయి లాక్ డౌన్ విధించినప్పుడు పతనం అయిన స్థాయిలో షేర్ల విలువలు మళ్ళీ ఇంచుమించు అదే స్థాయిలో పతనం అయ్యాయి.
ప్రస్తుతానికి ‘స్ట్రెయిన్’ వైరస్ ఇండియాలోకి ఎంటర్ అయినట్లుగా ఎటువంటి వార్తలు రాకపోయినా బ్రిటన్ జర్మనీ దేశాలలోని పరిస్థితులు తెలుసుకుని అటువంటి పరిస్థితులు మన దేశంలో కూడ వస్తాయి అన్న భయంతో మదుపర్లు ఇలా పైనిక్ సెల్లింగ్ ఒకేసారి చేయడంతో ఇలా స్టాక్ మార్కెట్ కుప్ప కూలిపోయింది. అమెరికా ఉద్దీపన ప్యాకేజ్ బ్రెగ్జిట్ చర్చల ఫలితాలను బట్టి ఈ వారం షేర్ మార్కెట్ ప్రభావితం అవుతుంది అన్న అంచనాలు మొదట్లో వస్తే ఆ అంచనాలను తారుమారు చేసి ఇప్పుడు స్ట్రయిన్ ఇండియన్ స్టాక్ మార్కెట్ కు గ్రహణంగా మారింది..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి