కరోనా పరిస్థితులు ఏర్పడిన తరువాత సాఫ్ట్ వేర్ ఐటి ఆధారిత కంపెనీలలోని ఉద్యోగులు ఇప్పటికీ 95 శాతం వరకు ఇంటి నుంచే పై చేస్తున్నారు. అయితే చాల సాఫ్ట్ వేర్ కంపెనీలు ఇప్పుడే ప్రారంభం అయిన కొత్త సంవత్సరంలో తమ ఉద్యోగులను నెమ్మదినెమ్మదిగా ఆఫీసులకు రప్పించే ‘రిటర్న్ టు ఆఫీస్’ పద్ధతిని అమలు చేయాలని ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.


వాస్తవానికి 90 శాతంమంది తమ ఇంటి నుంచే పనిచేస్తున్నప్పటికీ తమ ఉత్పాదక బాగానే ఉన్న పరిస్థితులలో ఇప్పటికే తమ సొంత ఊరుకి వెళ్ళిపోయి అక్కడ నుండి పనిచేస్తున్న చాలామంది ఐటి ఉద్యోగులు రిటర్న్ టు ఆఫీసుకు ఆశక్తి కనపరచడం లేదనీ తాము ఈ సంవత్సరం అంతా ఇలాగే పని చేస్తున్నట్లు చెపుతున్నట్లు హైసియా అధ్యయనంలో వెల్లడైనట్లు తెలుస్తోంది. దీనితో గతంలో లా 100 శాతం మంది ఉద్యోగులు ఆఫీసులకు వచ్చి పనిచేసే పరిస్థితులు ఉండకపోవచ్చని ఈ అధ్యయనం అభిప్రాయపడుతోంది.


దీనికితోడు సుమారు 50 శాతం మంది ఐటి ఉద్యోగులు ఇప్పటికే తమ సొంత ఊరు వెళ్ళిపోయిన పరిస్థితులలో వారిని నెమ్మదిగా ఒప్పించి మళ్ళీ ఆఫీసులకు తీసుకు రావడం చాల కంపెనీలకు కష్టంగా మారిందని ఆధ్యయనం అభిప్రాయ పడుతోంది. అయితే చిన్నతరహా మధ్య తరహా ఐటి కంపెనీలు మాత్రం ఉద్యోగులు తమ ఆఫీసులకు వచ్చి పనిచేయాలని ఒత్తిడి చేస్తున్న పరిస్థితులలో రాబోతున్న మర్చి ప్రాంతానికి ఆఫీసులకు వచ్చి పనిచేసే వారి శాతం 50 నుండి 70 శాతం ఉండవచ్చని ఈ నివేదిక అంచనా కడుతోంది.


అంతేకాదు కంపెనీలు ఎంత ఒత్తిడి చేసినా క్రితంలా వంద శాతం మంది ఉద్యోగులు ఆఫీసులకు వచ్చి పనిచేసే పరిస్థితులు ఈ సంవత్సరం కూడ ఉండకపోవచ్చని ఈ నివేదిక అభిప్రాయం. చాల కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ ను ప్రస్తుత పరిస్థితులలో కొనసాగిస్తున్నప్పటికీ ఈ పద్ధతి ఐటీ రంగంలో శాస్వితంగా మారకూడదని అనేక ప్రముఖ ఐటి నిపులు కూడ అభిప్రాయ పడుతున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: