క్రితం సంవత్సరం జనవరి ఫిబ్రవరి లో అనేక ప్రముఖ కంపెనీలు తమ సంస్థలో ఉద్యోగస్తుల ఎంపిక కోసం అనేక క్యాంపస్ ఇంతర్వ్యూలు జరిపాయి. అయితే ఆ తరువాత కరోనా పరిస్థితులు దాడి చేయడంతో అనేక సమస్యలలో పడ్డ ప్రముఖ కంపెనీలు తాము ఇప్పటికే ఇచ్చిన క్యాంపస్ ప్లేస్ మెంట్స్ కు సంబంధించిన కాల్ లెటర్స్ ను పట్టించుకోవడం లేదని దీనితో అనేకమంది తమ ఉద్యోగం వచ్చిందో లేక రాలేదో తెలియక ఇబ్బంది పడుతున్నారని ఆ కథనం పేర్కొంది.
ఇక గత సంవత్సరం అంతా ఆన్ లైన్ క్లాసులతోనే ఇంజనీరింగ్ కాలేజీలు నడవడంతో ఏ ప్రముఖ కంపెనీ కూడా క్యాంపస్ ప్లేస్ మెంట్స్ కోసం ఇంటర్వ్యూలు నిర్వహించక పోవడంతో ఇప్పుడు ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్ధులకు తమ చదువులు అయ్యాక ఏమి చేయాలో తెలియక అయోమయంలో ఉన్నట్లు ఆ కథనంలో అనేక ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న లక్షలాది మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఖాళీగా ఉండటంతో తక్కువ వేతనం ఇచ్చి ఎక్కువ పనులు చేసే ప్రతిభావంతులైన అభ్యర్ధుల కోసం పెద్ద కంపెనీలు అన్వేషణలో ఉన్నట్లు ఆ కథనం పేర్కొంది. ప్రస్తుతం సాఫ్ట్ వేర్ కంపెనీల పనులు అన్నీ ఆన్ లైన్ లో జరుగుతున్న పరిస్థితులలో ఫ్రెషర్స్ తో ఆన్ లైన్ లో పని చేయించుకోవడం వారిని కో ఆర్డినేట్ చేయడం కష్టం అన్న అభిప్రాయంతో అనేక కంపెనీలు తమ కంపెనీలలో ఉద్యోగాల కోసం ఫ్రెషర్స్ పనికిరారు అన్న అభిప్రాయంలో ఉన్నట్లు తెలుస్తోంది..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి