ఈ మధ్యకాలంలో కరోనా మళ్లీ విజృంభిస్తున్న సమయంలో ప్రతి ఒక్కరు ఇంటికే పరిమితమవుతున్నారు. ఇంటికే పరిమితమైతే ఆదాయం కష్టం కాబట్టి చాలామంది వ్యాపారాలు మొదలుపెట్టాలని ఆలోచిస్తున్నారు.. ఇప్పుడిప్పుడే రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా వడ పావ్ చాలా ఫేమస్ చిరుతిండిగా మారిపోతుంది. ఈ నేపథ్యంలోనే ఎక్కడ చూసినా వడ పావ్ అవుట్లెట్స్ వెలుస్తున్నాయి. చాలా కంపెనీలు వడ పావ్ ఫ్రాంచైజీ యూనిట్లను కూడా ఆఫర్ చేస్తూ ఉండటం గమనార్హం.. ఆ ఫ్రాంఛైజీల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

అయితే  గోలి వడ పావ్ ఫ్రాంఛైజీ కోసం.. ఎవరైనా సరే పెట్టుబడి పెట్టాలి అనుకునే వాళ్ళు ముందుగా  ఒక స్టోర్, గోడౌన్ ఏర్పాటు చేసుకోవాలి.. ఇక సెక్యూరిటీ ఫీజు మొత్తం కంపెనీకి చెల్లించాలి.. అంతే  కాకుండా మీ సొంత స్థలంలోనే వ్యాపారం చేస్తే  అతి తక్కువ పెట్టుబడి తో నే మంచి ఆదాయం పొందవచ్చు.. ఇందుకోసం ఫ్రాంచైజీ ఫీజు రూ. రెండు లక్షల నుండి రూ.3 లక్షల వరకు ఉంటుంది.. ఇక ఇతర ఛార్జీలు అయితే రూ.3లక్షల నుండి రూ. 5 లక్షల వరకు ఉంటాయి. మొత్తంగా పెట్టుబడి చూసుకుంటే రూ.పది లక్షల నుంచి రూ.పదిహేను లక్షల వరకు అయ్యే అవకాశాలు ఎక్కువ.

ఈ గోలి వడ పావ్ ఇంట్లోనే తయారు చేసి కూడా అమ్మవచ్చు.. ఇక అన్నీ లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టలేము అనుకునే వాళ్ళు ఇంటి దగ్గరే చిన్న దుకాణం లాగా ఏర్పాటు చేసుకొని సెంటర్ను ఏర్పాటు చేసుకోవచ్చు . ఇక ఇందుకోసం కావలసిన అన్ని వివరాలు కూడా మీకు సులభమైన పద్ధతిలో యూట్యూబ్ ఛానల్ ద్వారా చాలామంది తెలియజేస్తున్నారు. కేవలం బన్ను కొద్దిగా స్టఫ్ మాత్రమే అవసరం.. ప్రస్తుతం ఎక్కువ ప్రాధాన్యత ఉండడంతో పాటు అధిక ధర పలుకుతున్నాయి. కాబట్టి పెద్దగా ఖర్చు లేకుండా ఇంట్లో ఉంటూనే ఈ వ్యాపారాన్ని మీరు మొదలు పెట్టవచ్చు. ఈ కరోనా సమయంలో వడ పావ్ బిజినెస్ చాలా బాగా జరుగుతుందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: