తాజాగా కేంద్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త తెలిపింది. రైతుల అభివృద్ధి కోసం మోడీ ప్రభుత్వం కొత్త పథకాలను అందుబాటులోకి తీసుకొస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో పథకాల ద్వారా ప్రజలకు ఆసరాగా నిలబడ్డ కేంద్ర ప్రభుత్వం.. ఇప్పుడు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద ప్రతి ఏటా 6 వేల రూపాయల చొప్పున రైతుల ఖాతాలో జమ చేస్తోంది. అలాగే కిసాన్ మన్దాన్ యోజన పథకాన్ని కూడా తీసుకొచ్చింది. 60 సంవత్సరాలు పైబడిన రైతులు ఈ పథకానికి అర్హులు. ప్రభుత్వం ప్రతినెల 3 వేల రూపాయలను పింఛన్ గా అందజేస్తుంది. 18 నుంచి 4 ఏళ్లలోపు రైతులు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక దరఖాస్తు చేసుకునే రైతులకు కచ్చితంగా రెండు ఎకరాల భూమి ఉండాలి . 18 సంవత్సరాలు నిండిన రైతులు ఈ పథకంలో చేరితే ప్రతి నెల రూ.55 డిపాజిట్ చేయాలి.


అదే 30 సంవత్సరాలు నిండిన రైతులు ఈ పథకంలో చేరితే రూ.110 డిపాజిట్ చేయాలి.  40 యేళ్లు వాళ్ళు అయితే ₹200 కి పెరుగుతుంది. రైతుకు 60 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత ఈ మొత్తాన్ని పెన్షన్ రూపంలో పొందవచ్చు. మీ సమీపంలోని మీసేవ కేంద్రానికి వెళ్లి ఇన్కమ్ సర్టిఫికెట్, భూమికి సంబంధించిన పత్రాలు సమర్పించాలి.  మీ అకౌంట్లో డబ్బు జమ కావాలి అంటే మీ బ్యాంక్ అకౌంట్ సమాచారాన్ని కూడా అందివాల్సి ఉంటుంది. ఇక తర్వాత దరఖాస్తు ఫారంపై ఆధార్ కార్డుతో లింకు చేయించాలి.  ఇక అప్పుడు మీకు పెన్షన్ అకౌంట్ నెంబర్ ఇస్తారు . ఈ పథకాన్ని పొందేందుకు మీరు ఆన్లైన్ రిజిస్టర్ కూడా చేయవచ్చు.


మీకు దగ్గరలో ఉన్న కామన్ సర్వీస్ సెంటర్ కు వెళ్లి..maandhan.in కి వెళ్లి అక్కడ మీరే నమోదు చేసుకోవచ్చు.  మొబైల్ నెంబర్,  ఓటిపి సమాచారం ఎంటర్ చేసి పెన్షన్ పథకానికి అప్లై చేసుకోవచ్చు . ఇలా రైతులు వృద్ధాప్యంలో ఇబ్బందులు పడకుండా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: