దేశంలో వెనుకబడిన కులవృత్తులను అభివృద్ధి చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం సరికొత్త పథకాన్ని అమలు చేసింది ఆ పధకమే పీఎం విశ్వకర్మ యోజన పథకం.. దేశంలోని కులవృత్తుల వారికి వ్యాపార అభివృద్ధి కోసమే అతి తక్కువ వడ్డీకి ఎలాంటి పూచి లేకుండానే రుణ సహాయాన్ని సైతం కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది. ఈ పథకాన్ని 2023 సెప్టెంబర్ 17న ప్రారంభించారు.. ఢిల్లీలో యశో భూమిలో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టినట్లుగా తెలుస్తోంది. పీఎం విశ్వకర్మ యోజన పథకం కింద 18 వర్గాల ప్రజలకు లబ్ధి చేకూర బోతోందట.


దీని ద్వారా ఐదేళ్లలో 30 లక్షల మంది చేతి వృత్తుల వారి కోసమే ఏకంగా 13 వేల కోట్ల రూపాయల రుణాన్ని సైతం అందించాలని కేంద్ర ప్రభుత్వం ఆలస్యంగానే ముందుకు వెళ్తోంది.. అయితే ఈ రుణం పొందాలి అంటే ఎలాంటి పూజి ఉండాల్సిన పనిలేదు రూ .3లక్షల వరకు వ్యవస్థాపక వ్యాపార అభివృద్ధి కోసమే రుణాన్ని పొందవచ్చట. మొదటి విడతలో లక్ష రూపాయలు.. దానిని 18 నెలలు తిరిగి చెల్లించాలి ఆ తర్వాత రెండు లక్షల రూపాయలు 30 నెలలు చెల్లించాలి.. ఇక వడ్డీ రేటు కేవలం 5% మాత్రమే ఉంటుందట. మిగిలిన 8 శాతం వడ్డీని మధ్యతరహా పరిశ్రమల శాఖల ద్వారా ప్రభుత్వమే బ్యాంకులకు చెల్లిస్తుందట.


18 కులవృత్తుల వారికి తక్కువ వడ్డీతో ఎంపిక చేయబడిన వారికి శిక్షణ కూడా ఇస్తున్నారు. 5 నుంచి 7 రోజులపాటు ప్రాథమిక శిక్షణ ఇచ్చిన తరువాత వారికి ధ్రువీకరిస్తూ ఒక సర్టిఫికెట్ గుర్తింపు కార్డును కూడా ఇస్తారట... అయితే ఈ పథకం విశ్వకర్మ యోజన 2024 ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభమయ్యింది.. ఇప్పటివరకు రెండు తెలుగు రాష్ట్రాలలో చాలామంది దరఖాస్తు చేసుకున్నారు జిల్లాల వారీగా కూడా దరఖాస్తులు వెలుబడుతున్నాయట. ఎవరైనా కులవృత్తుల  రుణాలు పొందాలనుకుంటే వీటి ద్వారా పొందవచ్చు..

మరింత సమాచారం తెలుసుకోండి: