మెగా స్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య అనే సినిమా లో చేస్తున్న సంగతి తెలిసిందే.. అయితే ఈ సినిమా తరువాత చిరు చేయబోయే సినిమా పై కొంత అయోమయం నెలకొంది. వాస్తవానికి చిరు వివి వినాయక్, మెహర్ రమేష్, బాబీ సినిమాలను లైన్ లో ఉంచాడు.. అయితే వీటిలో ఏ సినిమా ఆచార్య తరువాత ఉంటుందనేది ఇంకా క్లారిటీ రాలేదు.. గత కొన్ని రోజులుగా చిరంజీవి తర్వాతి సినిమా వివి వినాయక్ దర్శకత్వంలో ని లూసిఫర్ అనుకున్నారు.. కానీ ఇప్పుడు ఆ సినిమా కాదని అంటున్నారు.. ఈ సినిమా తర్వాత మెహర్ దర్శకత్వంలోనే చిరు సినిమా చేయబోతున్నారట..