తెలుగులో బిలో యావరేజ్ గా నిలిచిన సాహో.. బాలీవుడ్ లో మాత్రం మంచి వసూళ్లు సాధించింది. అందుకే.. సుజిత్ ని తెలుగు నిర్మాతలు పట్టించుకోకపోయినా బాలీవుడ్ నుంచి పిలుపొచ్చింది.అక్కడి జీ స్టూడియోస్ సుజిత్ తో ఓ ఒప్పందం కుదుర్చుకుంది. సుజిత్ వాళ్ల కోసం ఓ భారీ యాక్షన్ చిత్రాన్ని తీయబోతున్నాడు. ఈ యేడాదే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్తుంది. అయితే ఇందులో నటించే హీరో ఎవరో డిసైడ్ అవ్వలేదు. బాలీవుడ్ కి చెందిన ఓ అగ్ర కథానాయకుడే నటిస్తాడని తెలుస్తోంది. మరి కొద్ది రోజుల్లో హీరో ఎవరన్న విషయంలో ఓ క్లారిటీ వస్తుంది. అయితే ఈసారి యాక్షన్ తో పాటు, ఎమోషన్ డ్రామాని కూడా మిక్స్చేశాడని సుజిత్ చెబుతున్నాడు. ఈసారైనా... తన ప్రయత్నం పూర్తి స్థాయిలో నెవరేరుతుందో, లేదో చూడాలి.