కరోనా మళ్ళీ విజృంభిస్తుందన్న వార్త ఇప్పుడు సినీ ప్రియుల్లో కలకలం సృష్టిస్తుంది.. ఎందుకంటే కరోనా ఎక్కువయితే ఫస్ట్ ఎఫెక్ట్ పడేది సినిమా ఇండస్ట్రీ పైనే.. థియేటర్లలో మళ్ళీ యాభై శాతం సీటింగ్ కెపాసిటీ నిబంధన ని తీసుకొస్తారు అవసరమైతే ధియేటర్ లు క్లోజ్ చేసినా ఆశ్చర్యం పోనవసరం లేదు.. దాంతో సినిమా లు ప్లాన్ చేసుకున్న రిలీజ్ డేట్ మార్చడం అంతా గందరగోళం నెలకొంటుంది.. కరోనా లాక్ డౌన్ తర్వాత అన్ని సినిమాలు రిలీజ్ అవుతూ ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీ పుంజుకునేలా కనిపిస్తుంది..