అల్లరి నరేష్ నటించిన యముడికి మొగుడు సినిమా విడుదల తేదీని ఖరారు చేశారు. ఈ సినిమాను ఈ నెల 22న విడుదల చేస్తున్నారు. చిరంజీవి సూపర్ హిట్ సినిమా టైటిల్ తో వస్తుండటం, సుడిగాడు తరువాత అల్లరి నరేష్ నటించిన సినిమా కావడంతో యముడికి మొగుడు సినిమా కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. యమలోకం, యముడు నేపధ్యంలో వచ్చిన తెలుగు సినిమాలు పరాజయం చెందడం చాలా అరుదు. పైగా ఈ సినిమాలో మినమం గ్యారంటీ హీరో అల్లరి నరేష్ నటిస్తున్నాడు. దీంతో ఈ సినిమా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ కొత్త ‘యముడికి మొగుడు’ సినిమాలో యముడిగా షియాజీ షిండే, అతని భార్యగా రమ్యకృష్ణ, యముడి కూతురుగా రిచా పనయ్ నటిస్తున్నారు. చంటి అడ్డాల నిర్మించిన ఈ సినిమాకు సత్తిబాబు దర్శకత్వం వహిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: