‘బెంగాల్ టైగర్’ అనుకున్న స్థాయిలో విజయం సాధించకపోవడంతో ఆ సినిమా కలెక్షన్స్ 30 కోట్ల స్థాయిని దాటడం కష్టం అనే మాటలు వినిపిస్తున్నాయి. సంపత్ నంది ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈసినిమాను రవితేజా వీరాభిమానులు కూడ రెండవసారి చూడటానికి పెద్దగా ఇష్టపడకపోవడంతో రవితేజ ఆశించిన భారీ విజయాన్ని ‘బెంగాల్ టైగర్’ ఇవ్వలేకపోయింది. 

దీనితో ఈసినిమా ప్రభావం రవితేజ దిల్ రాజ్ ల కాంబినేషన్ లో ప్రారంభం కావలసిన సినిమా పై పడింది అన్న వార్తలు వస్తున్నాయి. ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం దిల్ రాజ్ వేణు శ్రీరాం డైరెక్షన్ లో ప్రారంభించవలసిన ‘ఎవడో ఒకడు’ సినిమా షూటింగ్ 2o16 ఫిబ్రవరికి వాయిదా పడినట్లుగా వార్తలు వస్తున్నాయి. 

దేనికి కారణం పారితోషికం విషయంలో దిల్ రాజ్ రవితేజాల మధ్య ఏర్పడ్డ భేదాభిప్రాయాలు ఒక కారణం అయితే మరో కారణం ఈసినిమాకు సంబంధించి సెకండ్ ఆఫ్ స్క్రిప్ట్ సరిగా రాకపోవడం ఆని అంటున్నారు. రవితేజా తన ఎనర్జీతో ‘బెంగాల్ టైగర్’ లో కష్టపడి నటించినా ఆసినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చకపోవడంతో కథ విషయం గురించి గతంలో పెద్దగా పట్టించుకొని రవితేజా కూడ ఈసినిమా దర్శకుడు వేణు శ్రీరాం ను ఈసినిమా కథ సెకండ్ ఆఫ్ లో భారీ మార్పులు చేయమన్నాడని టాక్. 

\మళయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమా కథ ఒక కొత్త కోణంలో ఉంటూ నేటి యూత్ ను ఆకట్టుకునే అంశాలతో నిర్మించ బడుతోంది అని అంటున్నారు. అయితే ఈసినిమాను తాత్కాలికంగా వాయిదా వేసారా లేదంటే శాస్వితంగా వాయిదా వేసారా అనే కోణంలో కూడ గాసిప్పులు సందడి చేస్తున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: