వివాదాలకు దూరంగా ఉండే ప్రిన్స్ మహేష్ బాబు ఒక దర్శకుడితో  గొడవలు పడుతున్నాడు అన్న వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ విషయం ఫిలింనగర్ లో హాట్ టాపిక్ గా మారింది. ఆసక్తికరమైన ఈన్యూస్ వివరాలలోనికి వెళ్ళితే మహేష్ తో గొడవలు పెట్టుకోబోతున్న వ్యక్తి గతంలో మహేష్ తో సినిమాలు తీసిన దర్శకుడు అని అంటున్నారు. 

ఈ విషయానికి సంబంధించి ఆ దర్శకుడి పేరు తేజ అని కొద్దిమంది  ప్రచారం చేస్తూ ఉంటే మరి కొందరు దర్శకుడు జయంత్ సి.పరాన్జీ అని మరికొంతమంది అంటున్నారు. మురుగదాస్ దర్శకత్వంలో మహేష్  చేయబోతున్న లేటెస్ట్ సినిమాలో ఒక నెగిటివ్ టచ్ ఉన్న కీలక పాత్రలో తేజ కాని జయంత్ సి.పరాన్జీ కాని నటించడం ఖాయం అనే మాటలు వినిపిస్తున్నాయి. 

ఈ సినిమా దర్శకుడు మురగదాస్  ఒక విభిన్న మైన విలన్ పాత్రను వీరి కోసం సృష్టించాడు అన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించేందుకు పరిణీతి చోప్రాకు దాదాపు ముడున్నర కోట్ల పారితోషికంతో ఆమెను ఫైనల్ చేసారు అన్న వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలను ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. 

ఈ సినిమాను తమిళ ఉగాది రోజున ఏప్రిల్ లో మొదలు పెట్టాలి అని భావించినా ‘బ్రహ్మోత్సవం’ షూటింగ్ లో జరుగుతున్న జాప్యం వలన మహేష్ మురగదాస్ ల ప్రాజెక్ట్ జూన్ కు వాయిదా పడింది అన్న వార్తలు వస్తున్నాయి. ఏది ఎలా ఉన్నా మురగదాస్ మహేష్ పై చాలా ప్రయోగాలే చేస్తున్నాడు అనుకోవాలి. ఒక డైరెక్టర్ చేత నెగిటివ్ క్యారక్టర్ చేయించడం ఈమధ్య కాలంలో ఎక్కడా జరగని ప్రయోగం.. 



మరింత సమాచారం తెలుసుకోండి: