ఇటీవలికాలంలో కథలు అటూ ఇటూ షికార్లు చేయడం మామూలైపోయింది. తెలుగు కథలు హిందీలోకీ, హిందీ కథలు తెలుగులోకీ వస్తున్నాయి. ఇప్పుడు ఒక తెలుగు దర్శకుడు తన కథతోపాటు తాను కూడా బాలీవుడ్ కి వెళ్లాలనుకుంటున్నాడు. అతడే పూరి జగన్నాథ్. నిజానికి పూరికి బాలీవుడ్ కొత్తకాదు. గతంలో తాను తీసిన బద్రి సినిమాని తుషార్ కపూర్ హీరోగా షార్ట్ గా రీమేక్ చేశాడు. ఇటీవల అమితాబ్ తో‘బుడ్డా హోగా తేరా బాప్’ తీశాడు. ప్రస్తుతం అతడు ఒక హిందీ సినిమాకి సంతకం చేసాడట.
తెలుగు మర్యాద రామన్నను ‘సన్ ఆఫ్ సర్దార్’ గా తీసిన హిందీ నిర్మాత ఎన్ ఆర్ పాచీసియా పూరితో మాట్లాడాడట. ఒక సినిమా తన బ్యానర్ పై చేయాల్సిందిగా కోరాడట. పూరి దానికి అంగీకరించి తన పాత హిట్ సినిమాని రీమేక్ చేస్తానని చెప్పాడట. పూరి సినిమాల్లో సూపర్ హిట్టయిన పోకిరిని తీద్దామా అంటే దాన్ని ‘వాంటెడ్’గా ప్రభుదేవా తీసేశాడు. దాంతో, దేన్ని తీయాలా అని ఆలోచిస్తున్నాడు. మొదట్నుంచీ పూరికి ఇడియట్, ‘అమ్మా నాన్నా ఓ తమిళమ్మాయి సినిమాలంటే చాలా ఇష్టం. అందుకే, ఆ రెండింటిలో ఒకదాన్ని హిందీలో రీమేక్ చేయవచ్చని తెలుస్తోంది.
మరింత సమాచారం తెలుసుకోండి: