గుణశేఖర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సినిమా ‘రాణి రుద్రమ దేవి’. టైటిల్ రోల్ ను అనుష్క పోషిస్తున్న ఈ సినిమాలో దగ్గుబాటి రానా ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. కాగా, ఈ సినిమా కోసం అదితి చెంగప్ప ఎంపిక అయ్యింది. రాణి రుద్రమ దేవి సోదరి గణపాంబ పాత్రను అదితి చెంగప్ప పోషిస్తుంది.
కాగా, అదితి చెంగప్ప ‘తకిట తకిట’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది.
అలాగే ‘రాణిరుద్రమదేవి’ సినిమా కోసం అనుష్కతో పాటు హంసానందిని, నథాలియా కౌర్ లు ఇప్పటికే ఎంపిక అయ్యారు.
గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు.
మరింత సమాచారం తెలుసుకోండి: