బంగారం లాంటి అవకాశాన్ని పోగొట్టుకుంటే ఎవరికైనా చాలా బాధగా ఉంటుంది. ఆ అవకాశం తమకెందుకు లభించలేదా అంటూ ఫీల్ అయిపోతూ ఉంటారు. ప్రస్తుతం బిగ్ బి అమితాబ్ భచ్చన్ పరిస్థితి అదే. అమితాబ్ అంతలా బాధపడదానికి గల కారణం, ఇటివలే బాలీవుడ్ లో విడుదల అయిన “రాన్ జనా” చిత్రం. ధనుష్, సోనమ్ కపూర్ లు జంటగా నటించిన ఈ సినిమా బాలీవుడ్ లో కనకవర్షం కురిపిస్తోంది. పెద్ద తారలా దగ్గర నుండి చిన్న తారల వరకూ ఈ సినిమాని అందరూ ప్రశంశలతో ముంచెత్తి వేస్తున్నారు. ఈ సినిమా అమితాబ్ కు కూడా బాగా నచ్చేసిందట. ఇటువంటి అద్భుతమైన చిత్రంలో నటించే అవకాశం తనకు రాకపోవడం అసూయగా ఉందని తన ట్విట్టర్ లో అమితాబ్ రాశారు. అయితే ఈ అసూయను పక్కన పెట్టి మనస్పూర్తిగా ఈ చిత్ర యూనిట్ ను ప్రశంశల వర్షంతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు అమితాబ్.

భారత్ క్రికెట్ చాంపియన్ ట్రోపీ గెలుచుకున్న తరువాత తాను ఈ సినిమాను చూశానని, ధనుష్- సోనమ్ కపూర్ ల నటన తనకు ఎంతో నచ్చిందని, తన ట్విట్ లో పోస్ట్ చేశాడు అమితాబ్. అమితాబ్ లాంటి గొప్ప నటుడి అభిమానాన్ని తన అల్లుడు పొందాడని రజినీకాంత్ ఆనందపడిపోతున్నాదట. ఈ చిత్రం “అంబికాపతి” పేరుతో ఈనెల 28 న కోలీవుడ్ లో విడుదల కాబోతోంది. ధనుష్ కోలీవుడ్ లో ఈ సినిమా ద్వారా ఎన్ని సంచలనాలు సృస్తిస్తాడో అని కోలీవుడ్ మీడియా ఆశక్తికరంగా చూస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: